నందమూరి తారకరామారావుగారి జీవితం ఆధారం తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’. ఈ సినిమాని బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఇప్పటీకే పలు ముఖ్యమైన పాత్రల కోసం యువ నటుల్ని ఎంచుకున్నాడు దర్శకుడు క్రిష్. కాగా ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడుగారి పాత్రలో రానా, హరికృష్ణ పాత్రలో కల్యాణ్ రామ్, అక్కినేని నాగేశ్వరరావ్ పాత్రలో సుమంత్‌ను తీసుకున్న క్రిష్ ఇప్పుడు బాలక్రిష్ణగా నటించేందుకు నటుడ్ని ఇంకా ఫైనల్ కాలేదు.
ఈ పాత్రలో వేరెవరో నటుడ్ని తీసుకునే కంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను తీసుకుంటే చక్కగా ఉంటుంది. ఎందుకంటే బాలక్రిష్ణలోని రాజసం ఆయనలా లెంగ్తీ డైలాగ్స్ చెప్పే నైపుణ్యం, బాడీలోని ఎనర్జీ, డ్యాన్సుల్లో గ్రేస్ వంటి క్వాలిటీలన్నీ తారక్ లో ఉన్నాయి కాబట్టి మన యంగ్ టైగర్‌ను తీసుకువాలి అనుకుంటున్నారు. కానీ ఈ పాత్రలో యంగ్ టైగర్ నటిస్తారా అనేది చూడాలి.