రాబోయే ఎన్నికల్లో తన బాబాయ్ స్థాపించిన “జనసేన” పార్టీ తరపున ప్రచారంలో పాల్గొంటానని చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ ప్రకటించాడు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న రామ్‌చరణ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. నాన్నగారు పార్టీ పెట్టినప్పుడు ప్రచారం చేద్దామనుకున్నా అప్పట్లో బాబాయి వద్దన్నారు.. అందుకే చేయలేదు. ఇప్పుడు బాబాయ్ చాలా కష్టపడుతున్నారు అన్నారు.
బాబాయ్ అనుమతిస్తే జనసేన తరపున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చరణ్ అన్నారు. నేనే కాదు మా కుటుంబం మొత్తం బాబాయ్‌కు అండగా ఉంటుంది అన్నారు. రామ్ చరణ్ వ్యాఖ్యలతో మెగా అభిమానులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన మద్దతు ఎప్పటికీ బాబాయ్‌కే ఉంటుందని గతంలో చెర్రీ పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. హ్యాపీ మొబైల్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నచెర్రీ కొత్తగా ఛారిటబుల్ పౌండేషన్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. ఆరోగ్య సమస్యలున్న ప్రజలకు ఉపయోగపడేలా ఈ ఫౌండేషన్ సేవలు అఁదించబోతుందని తెలిపారు.