దర్శకధీరుడు రాజమౌళి సృష్టించిన కళాఖండం బహుబలి. ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లదు. ముఖ్యంగా బాహుబలి 2 వసూళ్ల పరంగా భారతదేశంలో సంచళనం సృష్టించి మొదటి స్థానం సోంతం చేసుకుంది. దంగల్, భజరంగి భాయ్ జాన్ వంటి సినిమాలు కూడా బాహుబలి 2 ని మించలేకపోయాయి. ఇదిలా ఉంటె, బహుబలి-2 సినిమాను ఓ చిన్న చిత్రం కలెక్షన్ తో బీట్ చేసింది.
బాహుబలి-2 సినిమా హైదరాబాద్ లోని దేవి థియేటర్లో మొదటి వారంలో రూ. 28,82,370 వసూలు చేసింది. మొన్నటి వరకు ఇవే రికార్డ్. బాహుబలి తరువాత రెండో స్థానంలో తొలిప్రేమ సినిమా నిలిచింది. ఇప్పుడు ఈ రెండింటిని బీట్ చేసింది ఆర్ఎక్స్ 100. ఆర్ఎక్స్ 100 మొదటి వారంలో రూ.29,32,867 లక్షల రూపాయలు వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. బడాబడా సినిమాలకు కూడా సాధ్యంకాని రికార్డ్ ను ఆర్ఎక్స్ 100 సాధించడం విశేషం.