పోలవరం క్విడ్ప్రోకో పేరిట చంద్రబాబు నాయుడు అసలు లేనిబడ్జెట్ను సృష్టించారా…? దేశంలో మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లోనూమూడేళ్ళలో 3545 కోట్లు వ్యయం చేసేందుకు కేంద్రం నిర్ణయించగాఆయన మాత్రం ఏకంగా ఏపీలోనే ఈ ఏడాది 7500 కోట్ల స్కామ్జరుగుతోందంటూ ఆరోపించడంలో ఆంతర్యం ఏమిటి? అసలుఆంధ్రప్రదేశ్కు బస్సుల కొనుగోలులో స్వేచ్ఛ, అధికారాలులేకపోయినప్పటికీ నేరుగా కొనేస్తుందంటూ ఆయన ఏ ఉద్దేశ్యంతోచెబుతున్నారు? అసలు రాష్ట్రాలకు లేని అధికారాన్ని ఆయనఏకంగా సృష్టించి దానికి క్విడ్ప్రోకో అంటూ కొత్త నామకరణం చేసేసితమ కాలంలో జరిగిన అక్రమాలు, అవకతవకల నుంచిబయటపడేందుకు కొత్త ఆరోపణలను తెరమీదకు తెచ్చారు.
ఆర్టీసీ అస్సలు బస్సులే కొనడం లేదు
ఏపీఎస్ఆర్టీసి నేరుగా బస్సుల కొనుగోలు చేసే పద్ధతే లేనప్పుడు ఇకఒలెక్ట్రా నుంచి ఎలక్ట్రిక్బస్సులు కొనుగోలు చేయడం ఎలాసాధ్యమవుతుంది? ఆర్టీసి నష్టాలతో నడుస్తుండడంతో బస్సులకొనుగోలు విధానం నిలిపివేసి పూర్తిగా లీజు పద్ధతిలో సేకరిస్తూప్రయాణికుల అవసరాలు తీర్చే విధంగా నడుపుతున్నారు. ఇప్పుడుఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలులోనూ అదే విధానం అవలంబిస్తున్నారు.ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా మార్గదర్శక విధానాలు జారీచేసింది. దేశంలో ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ, కర్నాటక మొదలైన రాష్ట్రాల రవాణా సంస్థలు లీజు పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులును ఒలెక్ట్రాతో పాటు ఇతర సంస్థలనుంచి సేకరిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగాఉన్నప్పుడు 2018 మే 23న అమరావతిలో ఒలెక్ట్రా ఏసీ బస్సులలోప్రయాణించి వాటికి కితాబు ఇవ్వడంతో పాటు రాష్ట్ర ఫ్రభుత్వంవివిధ నగరాల్లోనూ, తిరుమలు–తిరుపతి మద్య ఎలక్ట్రిక్బస్సులునడిపేందుకు పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తామని ప్రకటించారు.
ఇప్పుడు ఆయనే మేఘా నుంచి క్విడ్ ప్రోకో పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ కొనుగోలు చేస్తోందని గగ్గోలు పెడుతున్నారు. మేఘాపెట్టుబడులు ఉన్న ఒలెక్ట్రా గ్రీన్టెక్ సంస్థలో ఉన్నాయి. పోలవరంలోప్రధానమైన పనిని తక్కువ ధరకు అంటే 12.6శాతం తక్కువకుటెండర్ను మేఘా సంస్థ కోట్ చేసింది. ఈ పనికి సంబంధించినవివాదం ప్రస్తుతం కోర్టులో ఉన్నందున అది పరిష్కారమైతే తప్పపనిని ఆ సంస్థకు అప్పగించడం ప్రభుత్వానికి సాధ్యం కాదు. కానీమాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా తెలుగుదేశంనాయకులంతా పోలవరంలో వచ్చే నష్టాన్ని ఒలెక్ట్రా బస్సులకొనుగోలు చేయడం ద్వారా క్విడ్ప్రోకో కింద 7500 కోట్ల రూపాయలుసమకూరుస్తున్నారని ఆరోపిస్తున్నారు.
అసలు ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులునే కొనుగోలు చేసే విధానమే లేదు.కేంద్రం ప్రభుత్వం ఫేమ్-2 కింద 350 బస్సులను ఏపీకి మంజూరుచేసింది. ఈ బస్సులను అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్న విధంగానేలీజు పద్ధతిలో ఉత్పత్తి సంస్థ నుంచి తీసుకొని 12 ఏళ్ళపాటు ఆసంస్థలే నిర్వహిస్తే కిలోమీటర్కు నిర్ధారించిన ధర ప్రకారం చెల్లించేవిధానాన్ని అమలు చేస్తోంది. ఇందుకోసం ఏడాదికి 3.98 కోట్లకిలోమీటర్లు మేర ఈ బస్సులు నడపాలని ప్రతిపాదించారు.ప్రాథమికంగా కిలోమీటర్కు రూ. 39 చెల్లించాలని భావిస్తున్నారు.అయితే టెండర్లో ఏ సంస్థ తక్కువ ధరకు కోట్ చేస్తే ఆ సంస్థతోఒప్పందం కుదుర్చుకుని ఆ ప్రకారం చెల్లిస్తారు. ఇందుకోసం అక్టోబర్14న ఫైనాన్స్బిడ్ తెరుస్తారు.
ఏడాదికి 144 కోట్ల వ్యాపారం – 7500 కోట్లు క్విడ్ప్రోకో ఎక్కడో బాబేచెప్పాలి
ఇందుకోసం ఆర్టీసీ ఏడాదికి 144 కోట్ల రూపాయలు చెల్లించే విధంగాబడ్జెట్ ఏర్పాటు చేసుకుంటోంది. ఇందులో అత్యధిక భాగం కేంద్రప్రభుత్వమే సమకూరుస్తోంది. అంత మొత్తం బడ్జెట్ స్పష్టంగాకేటాయిస్తే ఒలెక్ట్రా బస్సుల కొనుగోలులో మేఘాకు రూ. 7500 కోట్లుఅక్రమంగా చెల్లించనున్నారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు.మొత్తం 350 బస్సుల లీజు పద్ధతిలో ఒలెక్ట్రాకు లభిస్తాయో లేదోతెలీదు. ఒకవేళ అన్ని బస్సులు ఒలెక్ట్రాకే లభిస్తే ఆ ప్రకారం ఏడాదికి144 కోట్లు చెల్లిస్తారు (టెండర్ ధర ఆధారంగా తుది చెల్లింపుఉంటుంది). అప్పుడు కూడా బస్సుల ధరలు నిర్వహణ ఖర్చుపోనూ ఒలెక్ట్రాకు లాభం రావచ్చు లేదా నష్టపోవచ్చు. 350 బస్సులుఆ సంస్థకే దక్కితే ఆర్టీసీ కేటాయించిన మొత్తం బడ్జెట్ ఆ సంస్థఖాతాలో చేరిపోయినట్లు కానేకాదు. అది వ్యాపారం మాత్రమేఅవుతుంది. ఆ ప్రకారం చూసుకుంటే ఐదేళ్ళలో 720 కోట్లు వ్యాపారంఆ సంస్థకు జరుగుతుంది. అప్పుడు కూడా మొత్తం వ్యాపారంమేఘాకు సంబంధం ఉండదు. ఒలెక్ట్రాలో అత్యధిక వాటా మాత్రమేమేఘా యాజమాన్యానికి ఉంది. మరిక్కడ 7500 కోట్లు క్విడ్ప్రోకోఎక్కడ నుంచి వచ్చిందో చంద్రబాబు నాయుడు అండ్ కో నే చెప్పాలి.
పోలవరం ప్రాజెక్ట్ను మేఘా ఇంజనీరింగ్ సంస్థ కాళేశ్వరంత్వరితగతిన పూర్తిచేసిన విధంగానే నిర్మించాలని నిర్ణయించుకుంది.తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమైన ప్రాజెక్ట్లు పూర్తి చేయడం ద్వారాతెలుగు ప్రజలకు ఎంతో కొంత ఉపయోగపడాలనేది సంస్థయాజమాన్య భావిస్తున్నట్లు పారిశ్రామిక వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందువల్లనే ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్ట్ను తక్కువ ధరకుకోట్ చేసింది. ఈ వ్యవహారం కోర్టులో పరిష్కారం అయితే తప్పమేఘాకు పని దక్కే పరిస్థితి లేదు.
పోలవరం లెస్ టెండర్తో బాబులో గుబులు
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పోలవరం పనుల్లో2400 కోట్ల మేర అక్రమాలు, అవకతవకలు జరిగాయని తద్వారాఆయనతో పాటు ఆ పార్టీ నేతలు బాగా లబ్ధిపొందారని ఆరోపణలువచ్చాయి. ఈ ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ వాటినిఆధారాలతో సహా బయటపెట్టింది. దాంతో చంద్రబాబు ఐదేళ్ళకాలంలో చేసిన అక్రమాలు, అవకతవకలు బయటపడ్డాయి. ఎన్నికలప్రచార సమయంలో పోలవరాన్ని ఆయన ఏటీఎం కార్డుగావాడుకున్నారని ప్రధాని నరేంద్ర మోడి ఆరోపించిన సంగతి ఈసందర్భంగా గమనార్హం. అదే సమయంలో ప్రాజెక్ట్ను 2018 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ప్రకటించి ఘోరంగావిఫలమయ్యారు. ఎంత వేగంగా చేసినా కనీసం మూడేళ్ళుపడుతుంది. ముంపునకు గురయ్యే బాధితుల