ప్రేక్షకులు మెచ్చే సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్ చేతిలో ప్రస్తుతం రెండు ప్రాజెక్టులున్నాయి. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒకటి కాగా, హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ హీరో గా తెరకెక్కుతున్న చిత్రం ”పడి పడి లేచె మనసు”. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రాన్ని ప్రసాద్ చుక్కపల్లి- సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో హీరో సునీల్ ఓ కీలక పాత్ర చేయబోతున్నట్టు తెలిసింది. హీరో శర్వానంద్ కూడా డిఫరెంట్ లుక్ ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపించనున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెండో షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే కోల్‌కతాలో మొదటి షెడ్యూల్ భారీ సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని పోస్టర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఈ చిత్రాన్నిఇష్టపడతారని నితిన్ ట్వీట్ చేశారు.