HomeLatestప్రేమకథతో 'ఫిదా'

ప్రేమకథతో ‘ఫిదా’

ప్రేమకథతో ‘ఫిదా’ 

వినూత్నమైన కథలు ఎంచుకుంటూ అతి తక్కువకాలంలో తనకుంటూ ఓ మార్క్‌ తెచ్చుకున్న మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘ఫిదా’. అటు యువతను, ఇటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కథా బలమున్న చిత్రాలను తీసే శేఖర్‌ కమ్ముల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘ప్రేమమ్‌’ ఫేం సాయిపల్లవి కథానాయికగా తెలుగుతెరకు పరిచయమవుతోంది. శుక్రవారం నిజామాబాద్‌లోని బాన్సువాడలో ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దిల్‌ రాజు, సాయి పల్లవి క్లాప్‌నివ్వగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. 

 

అనంతరం దర్శకుడు శేఖర్‌ కమ్ముల మాట్లాడుడూ ”చక్కని ప్రేమకథతో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఆనంద్ , గోదావరి తర్వాత పూర్తిస్థాయి ప్రేమకథతో సినిమా చేయలేదు. ఈ సినిమాకు మంచి యూత్‌ఫుల్‌ కథ కుదిరింది. వరుణ్‌, సాయిపల్లవి జంట చూడముచ్చటగా ఉంది. ఇద్దరూ ప్రతిభగల నటులు. దిల్‌రాజుగారి బ్యానర్‌లో తొలిసారి పనిచేయడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది” అని అన్నారు. 
నాగబాబు మాట్లాడుతూ ”సినిమా అంటే పాషన్‌ ఉన్న నిర్మాత దిల్‌ రాజు. ఆయనతో సినిమా అంటే ఏ హీరో అయినా ముందుకొస్తాడు. ఫీల్‌గుడ్‌, విలువలున్న సినిమాలు తీయడంతో శేఖర్‌ కమ్ముల స్పెషలిస్ట్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో వరుణ్‌కి సినిమా కుదరడం ఆనందంగా ఉంది. టీమ్‌కి నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను” అని అన్నారు. 


దిల్‌ రాజు మాట్లాడుతూ ”ఏడాది క్రితం నుంచే శేఖర్‌ ఈ కథ మీద వర్క్‌ చేస్తున్నారు. కథ వినగానే చాలా ఎగ్జైట్‌ అయ్యి ఓకే చెప్పేశా. ‘కంచె’లో వరుణ్‌ నటన చూసి తనలో ఉన్న పొటెన్షియల్‌ అర్ధం చేసుకున్నారు దర్శకుడు. ‘ప్రేమమ్‌’లో సాయిపల్లవి క్యారెక్టర్‌కు ప్రేక్షకులంతా ఫిదా అయిపోయిన సంగతి తెలిసిందే. వీరిద్దరు ఈ కథకు యాప్ట్‌ అవుతారని సెలెక్ట్‌ చేశాం. అమెరికా అబ్బాయికి, తెలంగాణలో పెరిగిన అమ్మాయికి మధ్య సాగే ప్రేమకథ ఇది. ఈ సినిమా మా బ్యానర్‌లో ఓ సెన్సెషనల్‌ లవ్‌స్టోరీ అవుతుందని నమ్ముతున్నాను. దిల్‌, ఆర్య, కొత్త బంగారులోకం చిత్రాల తర్వాత కొత్త జోనర్‌ సినిమాలు తీసి విజయం సాధించాను. మరోసారి ఫ్రెష్‌ లవ్‌స్టోరితో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాం. శుకవ్రారం ప్రారంభమైన ఈ చిత్రం 40 రోజులపాటు బాన్సువాడలో చిత్రీకరణ జరుపుకుని తర్వాత షెడ్యూల్‌ను అమెరికాలో చేస్తాం” అని చెప్పారు. 

సాయిపల్లవి మాట్లాడుతూ ”తెలుగులో నా తొలి సినిమా ఇది. విజనరీ టీమ్‌తో పనిచేయడం, నా మొదటి సినిమా దిల్‌ రాజుగారి బ్యానర్‌లో కుదరడం ఆనందంగా ఉంది. వరుణ్‌ మంచి కోస్టార్‌” అని తెలిపారు.
ఈ చిత్రానికి కెమెరా: విజయ్‌కుమార్‌, సంగీతం: శక్తికాంత్‌, ఎడిటర్‌: మార్తాండ్‌.కె.వెంకటేష్‌. 

Recent Articles English

Gallery

Recent Articles Telugu