బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. మెరికన్ పాప్ సింగర్ నీకీ జోనస్ నిశ్చితార్థం ఈ రోజు (శనివారం) అంగరంగవైభోగంగా జరిగింది. శుక్రవారం నీకీ జోనస్ తన తల్లి దండ్రులతో కలిసి ఇండియా వచ్చాడు. శుక్రవారం నీకీ జోనస్ తన తల్లి దండ్రులతో కలిసి ఇండియా వచ్చాడు.కాగా గత కొంత కాలంగా వీరి ఇద్దరు డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. మొదటిసారి ఈ ఇద్దరు 2017లో కలిశారు. అక్కడి నుంచి వీరి ప్రయాణం ప్రారంభమైంది.
కొన్ని రోజులుగా వీరికి ఎంగేజ్మెంట్ జరిగిపోయిందని మీడియాలో వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ వీరిద్దరూ ముంబై వేదికగా ఒక్కటయ్యారు. ఈ రోజు సాయంత్రం ముంబైలోని ఒక ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్‌లో కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు ప్రియాంక ఎంగేజ్‌మెంట్ పార్టీ ఇవ్వనున్నట్లు ఆమె సన్నిహితలు తెలిపారు. అయితే ఈ వేడుకను ప్రియాంక చాలా ముఖ్యమైనదిగా భావిస్తోన్నట్లు సమాచారం. ఈ ఏడాది సెప్టెంబర్ 16న నిక్ జోనాస్ 26వ పుట్టిన రోజు సందర్భంగా ప్రియాంక – నిక్ జోనాస్‌లు వివాహం చేసుకోనున్నట్లు సమాచారం.