HomeTelugu Newsప్రభాస్ తో సుకుమార్ లెక్కలు!

ప్రభాస్ తో సుకుమార్ లెక్కలు!

దర్శకుడు సుకుమార్ రూపొందించిన ‘రంగస్థలం’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరో మూడు రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా తర్వాత సుకుమార్ ఏ సినిమా చేస్తాడన్న విషయంపై చర్చలు నడుస్తున్నాయి. మహేష్, ఎన్టీఆర్, బన్నీ, రామ్ చరణ్ తో సినిమాలు చేసిన సుక్కు ఇప్పుడు ప్రభాస్ తో సినిమాకు సిద్ధమవుతున్నాడని తెలుస్తుంది.prabhas 1బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఏంటన్నది తెలిసిందే. ప్రస్తుతం సుజిత్ డైరక్షన్ లో సాహో సినిమా చేస్తున్న ప్రభాస్ ఆ తర్వాత రాధాకృష్ణ డైరక్షన్ లో సినిమా చేయాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ సుకుమార్ కు ఓకే చెప్పే అవకాశం ఉందట. ఈలోగా సుకుమార్.. అల్లు అర్జున్ తో ఓ సినిమా చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu