HomeTelugu Newsప్రభాస్‌ పెళ్లి అప్పుడేనట..!

ప్రభాస్‌ పెళ్లి అప్పుడేనట..!

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ఓ పీరియాడికల్‌ లవ్‌స్టోరీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వంశీ, ప్రమోద్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఈ మూవీలో ప్రభాస్‌ జ్యోతిష్యుడి పాత్రలో కనిపించనున్నారట. 1940 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ లవ్‌స్టోరీ ఆగస్ట్‌ చివరి వారంలో స్టార్ట్‌ కావాల్సింది. కానీ అక్టోబర్‌ ఫస్ట్‌ వీక్‌లో స్టార్ట్‌ కానుందట.

2 27

కాగా ఈ చిత్రం లో జ్యోతిష్యుడిగా కనిపిస్తారట. మరి ఇది నిజంగా సినిమాలో పూర్తి స్థాయి పాత్రా లేకపోతే పూజా హెగ్డేను ప్రేమలో పడేయడం కోసం చేసే ప్రయత్నమా తెలియాలి. ఈ పీరియాడికల్‌ మూవీ షూటింగ్‌ మొత్తం ప్యారిస్‌లో జరగనుంది. ఇదిలా ఉంటే ప్రభాస్‌ పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతున్నారనే వార్త వినిపిస్తోంది. వచ్చే ఏడాదిలో పెళ్లి జరగనుందన్నది ఆ వార్త సారాంశం.

‘బాహుబలి’ అనే యజ్ఞం పూర్తయ్యాక పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రభాస్‌ ఫైనల్‌గా పెళ్లికి ఓకే అన్నారట. ఆయన చిన్నాన్న కృష్ణంరాజు కూడా ప్రభాస్ పెళ్లి విషయంలో ఆసక్తిగానే ఉన్నారు. తాజాగా సాహో పూర్తయిన వెంటనే ప్రభాస్ పెళ్లి పీటలెక్కడం ఖాయమని కృష్ణంరాజు ఇటీవల చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఎప్పుడనేది కచ్చితంగా చెప్పలేకున్నా కృష్ణంరాజు మాటల్ని బట్టి సాహో పూర్తయ్యాక త్వరలోనే ఉండే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu