Homeతెలుగు Newsప్రధాని మోడీ హత్యకు మావోయిస్టుల కుట్ర!

ప్రధాని మోడీ హత్యకు మావోయిస్టుల కుట్ర!

ప్రధాని మోడీని హత్య చేసేందుకు మావోయిస్టులు కుట్ర పన్నారని మహారాష్ట్ర పోలీసులు వెల్లడించారు. భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య తరహాలోనే మోడీని హత్య చేసేందుకు మావోయిస్టుల కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో పాటు పుణెకు సమీపంలోని భీమా కోరెగావ్‌ గ్రామంలో జరిగిన హింస కేసులో విప్లవ రచయిత సంఘం(విరసం) నేత వరవరరావును, హక్కుల నేతలు వెర్నాన్‌ గోంజాల్వేస్‌, అరుణ్‌ ఫెరీరియా, సుధా భరద్వాజ్‌, గౌతమ్‌ నవలఖలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి మహారాష్ట్ర అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ పరంబీర్‌ సింగ్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.

8 26

“అరెస్టు చేసిన పౌరహక్కుల నేతలకు, మావోయిస్టులకు సంబంధాలు ఉన్నట్లు రుజువులు ఉన్నాయి. రాజీవ్‌గాంధీ తరహాలో మోడీని హత్య చేయాలని ప్రణాళికలు వేసినట్లు అరెస్టు అయిన పౌరహక్కుల నేతకు, మావోయిస్టులకు మధ్య లేఖల ద్వారా సంభాషణ జరిగింది. గ్రనేడ్లు కొనుగోలు చేసేందుకు డబ్బులు ఇవ్వాల్సిందిగా ఆ లేఖ‌లో ఉంది. పౌరహక్కుల నేతల దగ్గర నుంచి కొన్ని వందల లేఖలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో కొన్ని లేఖలు అరెస్టయిన నేతలు, మావోయిస్టులకు మధ్య చేతులు మారాయి. అధికారుల దృష్టిని ఆకర్షించాలంటే ఏదో ఒక పెద్ద ప్లాన్‌ వేసేందుకు ప్రణాళికలు వేసుకున్నట్లు లేఖలో ఉంది. స్వాధీనం చేసుకున్న డిస్క్‌ల్లో ఒక రాకెట్‌ లాంచర్‌ పాంప్లెట్‌ లభ్యమైందని పరంబీర్‌ తెలిపారు. ఈ కేసులో అరెస్టు చేసిన వారిని జైల్లో పెట్టవద్దని, సెప్టెంబరు 6 వరకు గృహ నిర్బంధంలోనే ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో అరెస్టు అయిన నేతలు వరవరరావు, గోంజాల్వేస్‌, ఫెరీరియాలను వారి స్వగృహాలకు తరలించారు. ఇళ్ల చుట్టూ గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu