HomeTelugu Big Storiesప్రకాశం జిల్లా టీడీపీ.. తీవ్ర స్థాయికి చేరిన విబేధాలు!

ప్రకాశం జిల్లా టీడీపీ.. తీవ్ర స్థాయికి చేరిన విబేధాలు!

ఒకవైపు ఎన్నికల సమరానికి షెడ్యూల్ వచ్చేస్తూ ఉండగా.. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీలో తమ్ముళ్ల తన్నులాట తీవ్ర స్థాయికి చేరడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో అలాంటి పరిస్థితే ఉంది. జిల్లాల వారీగా విభజించి చూస్తే.. కొన్ని జిల్లాలో విబేధాలు తీవ్ర స్థాయికి చేరాయి. దీనికి పలు కారణాలున్నాయి. వాటిలో మొదటిది ఫిరాయింపు నేతలు రావడం పాత వారికి ఏమాత్రం నచ్చకపోవడం. టికెట్ల విషయంలో ఫిరాయింపుదారులకూ పాత వారికి రచ్చలు సాగుతూ ఉన్నాయి. ఇక ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ తరఫున పని చేసి కొంతమంది కోట్ల రూపాయలు కూడబెట్టారు. ఇసుక, మట్టి ఇలా ఏదీ వదలకుండా దోచి వందల కోట్లు సంపాదించిన వాళ్లూ ఉన్నారు. ఇలాంటి వాళ్లు తమ అధికార పరిధిని పెంచుకోవాలని చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ్ముళ్ల తన్నులాట తీవ్ర స్థాయికి చేరింది. అలాంటి గొడవలు గట్టిగా ఉన్న జిల్లాల్లో ఒకటైన ప్రకాశంలో తాజా పరిస్థితి ఇది..

TDP prakasam

కొండేపి నియోజకవర్గం : ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామిని పలువురు టీడీపీ ముఖ్యనేతలు వ్యతిరేకిస్తున్నారు. ప్రధానంగా కొండేపి మండలం గోలినేని
వారిపాలెం గ్రామానికి చెందిన గ్రానైట్ వ్యాపారి చింతల వెంకటేశ్వర్లు, కొమ్మాలపాటి రాఘవ (చొడవరం), కోనంనేని రమేష్బాబు (కొండేపి), మారెడ్డి సుబ్బారెడ్డి (గుర్రపడియ), చదలవాడ చంద్రశేఖర్ (టంగుటూరు, ఎంపీపీ), పద్మావతి, (జరుగుమల్లి ఎంపీపీ), గాలి పద్మావతి, (జురుగుమల్లి జడ్పీటీసీ) కూడా ఎమ్మెల్యేని వ్యతిరేకిస్తున్నారు.

సంతనూతలపాడు:
ఈ నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే బీఎన్ విజయ కుమార్ను పలువురు టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. విజయ కుమార్ను వ్యతిరేకిస్తున్న నేతలు వీరయ్య చౌదరి (నాగులుప్పలపాడు ఎంపీపీ), మన్నం ప్రసాద్, టీడీపీ జిల్లా కార్యదర్శి (చీమకుర్తి), రావిపాటి రాంబాబు (చీమకుర్తి), గొట్టిపాటి రాఘవరావు, మాజీ టీడీపీ మండలాధ్యక్షుడు, (గుడిపూడివారి పాలెం), కొండ్రగుంట వెంకయ్య, టీడీపీ రైతు సంఘం జిల్లా
అధ్యక్షుడు (యర్రగుడిపాడు), మాదాల అనిత, (సంతనూతలపాడు ఎంపీపీ,), మాదాల రమేష్, టీడీపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు, (సంతనూతలపాడు), చెరుకూరి శ్రీనివాసరావు, మండల టీడీపీ అధ్యక్షుడు, (సంతనూతలపాడు), మండవ జయంత్ బాబు (మద్దిపాడు), మండవ రంగారావు, మాజీ ఏఎంసీ ఛైర్మన్ (మద్దిపాడు).

పర్చూరు:
ఈ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివ రావును వ్యతిరేకిస్తున్న నేతల వివరాలు : కొల్లూరి నాయుడమ్మ, మాజీ ఏఎంసీ ఛైర్మన్ (ఇంకొల్లు), జాగర్లమూడి అనిల్బాబు, మండల ఉపాధ్యక్షుడు (కారంచేడు), కొల్లా సుభాష్బాబు, మాజీ జడ్పీటీసీ, (పర్చూరు), కొల్లా సుబ్బరాయుడు, (కారంచేడు), షేక్ మెహర్తాజ్, ఎంపీపీ, (ఇంకొల్లు), షేక్ రఫీ, (ఇంకొల్లు).

TDP prakasam

మార్కాపురంః
ఈ నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిని వ్యతిరేకిస్తున్న నేతలు: ఇమ్మడి కాశీనా«థ్, టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి(మార్కాపురం), శ్రావణ వెంకటేశ్వర్లు, అడ్వకేట్(పొదిలి), జి. భాస్కర్, ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర కార్యదర్శి (పొదిలి), కందుల కళావతి, మాజీ సర్పంచ్ (తర్లపాడు), డీవీ కృష్ణారెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ (మార్కాపురం),

దర్శి:
ఈ నియోజకవర్గంలోని ముండ్లమూరు మండల అధ్యక్షుడు వెంకట్రావ్, మండల టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరావుల మధ్య ఆధిపత్య పోరు నేపథ్యంలో పార్టీలో విభేదాలు కొనసాగుతున్నాయి.

అద్దంకి: ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ కరణం బలరాం కుటుంబాల మధ్య చాలా కాలంగా విభేధాలు కొనసాగుతూ ఉన్నాయి. రెండు వర్గాలకు ఏ మాత్రం పొసగడంలేదు. వీరిద్దరు నేతల అనుచరులూ ఎక్కడా క్షేత్ర స్థాయిలో కలవడం లేదు.

యర్రగొండపాలెం: వైఎస్సార్సీపీనుంచి టీడీపీకి ఫిరాయించిన ఎమ్మెల్యే డేవిడ్ రాజును నియోజకవర్గంలో కీలకమైన నేతగా ఉన్న డాక్టర్ మన్నే రవీంద్ర తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో డేవిడ్ రాజుపై టీడీపీఅభ్యర్థిగా పోటీ చేసిన అజితారావు వర్గం కూడా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉంది.

ఒంగోలు: ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ను టీడీపీ ముఖ్యనేతలైన సింగరాజు రాంబాబు, యానం చిన యోగయ్య యాదవ్తో పాటు పలువురు నేతలు వ్యతిరేకిస్తున్నారు.

కందుకూరు: ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోతుల రామారావు, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతూ ఉన్నాయి. దివి శివరాం సోదరులు లింగయ్యనాయుడు (మాజీ మున్సిపల్ ఛైర్మన్), మరో సోదరుడు ప్రసాద్ కూడా ఎమ్మెల్యే పోతుల రామారావును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu