హీరో నారా రోహిత్, స్టెలిష్ విలన్ జగపతిబాబు కలిసి నటించిన చిత్రం “ఆటగాళ్లు”. ఈ చిత్రానికి పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకం పై రవీంద్ర-వాసిరెడ్డి శివాజీ-మక్కెన రాము-వడ్లపూడి జితేంద్రలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఇంటెలిజంట్ థ్రిలర్ కి “గేమ్ విత్ లైవ్” అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంటీజర్‌ను జూలై9 ఉదమం 10గంటల30 నిమిషాలకు విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ టైమ్ ఫిక్స్ చేసింది.కాగా ఈ మూవీ టీజర్‌ను రానా చేతుల మీదుగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ విడుదల చేయనుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వాసిరెడ్డి రవీంద్ర-వాసిరెడ్డి శివాజీ-మక్కెన రాము-వడ్లపూడి జితేంద్ర మాట్లాడుతూ..”కథ నచ్చి ఇద్దరు హీరోలు నటించడానికి అంగీకరించారు. నారా రోహిత్ జగపతిబాబులు ఇలాంటి కథను ఒప్పుకోవడం వల్ల భవిష్యత్తులో మరిన్ని మంచి కథలు వస్తాయి. చాలా వైవిద్యమైన సినిమా ఇది. బ్రహ్మానందంగారి కామెడీ హైలైట్‌గా నిలుస్తుంది. అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. దర్శకుడు మురళి “ఆటగాళ్లు” చిత్రాన్ని అద్భుతంగా మలిచిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. నారా రోహిత్-జగపతిబాబుల పాత్రలు ప్రేక్షకుల్ని ఆద్యంతం ఆకట్టుకొంటాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతోందన్నారు.