HomeTelugu Newsపోలవరం రివర్స్ టెండర్ వల్ల జరిగే లాభాలు....

పోలవరం రివర్స్ టెండర్ వల్ల జరిగే లాభాలు….

 గత చంద్రబాబు ప్రభుత్వం పోలవరం నిర్మాణంలో విఫలమైన నేపథ్యంలో పనులు యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయడమే కాకుండా అక్రమాలు, అవినీతి, అవకతవకలు అరికట్టేందుకు ప్రస్తుత ప్రభుత్వం నడుంబిగించడంతోనే వివాదం మొదలైంది. ప్రాజెక్ట్‌ వ్యయాన్ని తగ్గించి ఇప్పుడు కాంట్రాక్టర్‌ చేస్తున్న ధరకన్నా తక్కువకు ధరకు పనులు అప్పగించడమే కాకుండా కాళేశ్వరాన్ని తలపించే విధంగా నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేందుకు చేపట్టిన రివర్స్‌ టెండరింగ్‌, కొన్ని సంస్థల స్వార్థప్రయోజలనాల కారణంగా ఏదో తప్పు జలరిగిపోతోందనే అలజలడి సృష్టిస్తున్నారు. రివర్స్‌ టెండరింగ్‌ విజలయవంతం అయితే అప్పట్లో జలరిగిన అక్రమాలు, అవకతవకలు నిరూపణ అవుతాయనే ఆందోళనతోనే మొత్తం వ్యవహారాన్ని తప్పులతడకగా, ఎవరికో ప్రయోజలనం చేకూర్చే విధంగా చేపట్టారనే అభిప్రాయాన్ని ప్రజలల్లో కలిగించేందుకు ఓ వర్గం పథకం ప్రకారం ప్రచారం సాగిస్తోంది. వరద సమయంలో సాధారణంగా ఆగష్టు-నవంబర్‌ మధ్య ఈ ప్రాజెక్ట్‌ పనులు జలరగవు. ఎలాగు ఆపేయ్యాలి. అయితే రివర్స్‌ టెండరింగ్‌ వల్లనే పనులు ఆగిపోయాయనే ప్రచారం సృష్టించడం ద్వారా మొత్తం గందరగోళ పరిస్థితులు నెలకొన్నట్లు ప్రచారం జలరుగుతోంది.
చంద్రబాబు ప్రభుత్వంలో వేలకోట్ల రూపాయల పనులు నామినేషన్‌ పద్ధతిలో నిబంధనలకు విరుద్ధంగా అప్పగించినా చెల్లింపుల పేరుతో అక్రమాలకు, అవినీతికి పాల్పడి కూడా సకాలంలో పనులు చేయించలేకపోయిన వైఫల్యాలను ఎండగట్టలేకపోయిన వారు ఇప్పుడు పారదర్శక విధానాన్ని తప్పుబడుతున్నారు. తమ వారైతే తప్పుచేసినా పర్వాలేదు. కోట్లు మింగేసినా రాయరు, మాట్లాడరు. తమకు నచ్చని వారు అధికారంలో ఉంటే పారదర్శకంగా టెండర్లు నిర్వహించి ఆదాయం చూపించేందుకు ప్రయత్నిస్తున్నా అక్కసు వెళ్లగక్కుతున్నారు. తద్వారా ఈ ప్రభుత్వం పోలవరాన్ని వివాదంలో ముంచుతోందనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు.
polavaram
ఈ ప్రాజెక్ట్‌ను గత ప్రభుత్వం ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకొని నిర్మాణ పనులుకన్నా ఏటీఎం తరహాలో సంపాదనకే ఉపయోగించుకుందని ప్రధానమంత్రి నరేంద్రమోడి ఆరోపించిన సంగతి తెసిందే. ప్రాజెక్ట్‌ 2018 డిసెంబర్‌ నాటికి పూర్తి చేసి ఆయకట్టుకు నీరు అందిస్తామని అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పినప్పటికీ అందుకు అనుగునంగా పనులు జలరగకపోగా పెద్ద ఎత్తున అక్రమాలు, అవినీతి చోటు చేసుకుంది. పైగా ప్రాజెక్ట్‌లో కీలకమైన జల విద్యుత్‌ కేంద్రం పనులు ప్రారంభించకపోగా ఆ సంస్థకు ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగానే స్థలాన్ని అప్పగించలేదు. ఫలితంగా పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి నష్టం వాటిల్లుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఓ వైపు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని గోదావరి నది జలలాను పూర్తిగా ఉపయోగించుకునేందుకు కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల పథకాలను యుద్ధప్రతిపాదికన ఆశ్చర్య గొలిపే పద్ధతిలో పూర్తి చేస్తోంది. సంక్లిష్టమైన పనులు ఉన్నప్పటికీ ఎత్తిపోతల పనులను ఆగమేఘాల మీద తెలంగాణ ప్రభుత్వం చేయిస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ప్రతిష్టాత్మకమైన పోలవరం ఎక్కడివేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారయ్యింది. అసలు ఈ ప్రాజెక్ట్‌కు నిధుల సమస్య లేదు. పోలవరానికి కేంద్రం నిధులు సమకూరుస్తున్నప్పటికీ సకాలంలో పనులు పూర్తి చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం శ్రద్ధ చూపకపోగా కాంట్రాక్టర్లకు అప్పనంగా చెల్లించి తద్వారా వసూళ్లకే ప్రాధాన్యత ఇచ్చినట్లు బమైన ఆరోపణలు ఉన్నాయి.
పోలవరం ప్రాజెక్ట్‌ హెడ్‌వర్క్స్‌, జలవిద్యుత్‌ కేంద్రం పనులల్లో రూ. 2346.85 కోట్ల అక్రమ చెల్లింపులు, అవకతవకలు జరిగినట్లు రాష్ట్ర ఫ్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ తేల్చింది. అంటే అప్పటి ప్రభుత్వంలోని పెద్దలకు ఇది ఆదాయ వనరుగా మారిందని ప్రధాని నరేంద్రమోడి ఆరోపణలు ఇక్కడే రుజువవుతున్నాయి. అధికారంలో ఉన్నవారికి అక్రమంగా అవినీతి మూటలు చేరకపోయి ఉంటే అప్పట్లో మొత్తం వ్యయంలో దాదాపు యాభైశాతం ఆ విధంగా చెల్లిస్తారా? పనులుకన్నా అక్రమాలు, అవకతవకల పద్ధతుల్లో భారీ చెల్లింపులు జరిగిపోయాయి. అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే రివర్స్‌ టెండరింగ్‌ నిర్వాహించాలని సూచించింది. పోలవరం హెడ్‌వర్క్స్‌లో జలవిద్యుత్‌ కేంద్రం పునాది పనులు అంతర్భాగం. ఇటు హెడ్‌వర్స్స్‌నూ అటు జలవిద్యుత్‌ కేంద్రం పనులను దక్కించుకున్న ఓ సంస్థ హెడ్‌వర్స్క్‌లో జలవిద్యుత్‌ కేంద్రం పునాది పనులు ప్రారంభించనే లేదు. కానీ జలవిద్యుత్‌ కేంద్రం సైట్‌ను అప్పగిస్తే పనులు చేస్తామంటూ 2017 డిసెంబర్‌ నుంచి నోటీసులు ఇస్తోంది. అంటే చంద్రబాబు ప్రభుత్వంలో సమన్వయ లోపం, చిత్తశుద్ధి లోపించడం వల్లనే జల విద్యుత్‌ కేంద్రం పనులకు అంకురార్పణ జలరగలేదు. దీన్నే నిపుణుల కమిటీ ఎత్తిచూపుతూ హెడ్‌వర్స్స్‌లో మిగిలిన పనులు, జలవిద్యుత్‌ కేంద్రం పనులకు ఒకే ప్యాకేజీ కింద టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలని సూచించింది. తద్వారా సమన్వయ లోపాన్ని నివారించి ఒకే సంస్థ-ఒకే ప్యాకేజీ ద్వారా మొత్తం పనిని పూర్తిచేయడం సాధ్యమవుతుంది. ఇలా చేయడం వల్ల రెండేళ్లలోగా ప్రాజెక్ట్‌ పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని తేల్చిచెప్పింది.
నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు పోలవరం హెడ్‌వర్స్క్‌లో మిగలిని రూ. 1771.44 కోట్ల పనులకు, జలవిద్యుత్‌ కేంద్రం పనులు రూ. 3216.11 కోట్ల పనులను ఒకే ప్యాకేజీ కింద కలిపి రూ. 4987.5 కోట్ల వ్యయంతో ఆగష్టు 17న రివర్స్‌ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే ఓ సంస్థకు జల విద్యుత్‌ కేంద్రం పనులు రద్దు చేయడాన్ని కోర్టు రద్దు చేసింది. ఆ సంస్థ కోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వ నిర్ణయం చెల్లదంటూ ఆదేశాలు వెలువడ్డాయి. దీనిపై ప్రభుత్వం తిరిగి సాంకేతికపరమైన అంశాలు, వాణిజ్యపరమైన వ్యవహారాలు పరిగణలోకి తీసుకొని మళ్లీ విచారించాలంటూ హైకోర్టుకు వెళ్లింది. ఈ కేసు విచారణ జలరగాల్సి ఉంది. ఈ లోగా ప్రభుత్వం తాను ముందుగా నిర్ణయించుకున్నట్లుగానే టెండర్లకు సంబంధించిన వ్యవహారంతో ముందుకు వెళుతోంది. ఇప్పటికే ప్రి-బిడ్‌కు సంబంధించి సమావేశం నిర్వహించగా నాలుగు ఇంజనీరింగ్‌ సంస్థలు హాజరయ్యాయి.
ఇప్పటివరకు దేశంలో ఎప్పుడూ, ఎక్కడా లేనివిధంగా టెండర్‌ ప్రాసెస్‌ను ప్రభుత్వం పారదర్శకంగా చేపట్టింది. టెండర్‌ డాక్యుమెంట్లు సంస్థలకే కాకుండా సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచింది. తద్వారా ఇందుకు సంబంధించిన అంశాలు దాపరికం లేకుండా సోషల్‌ మీడియాలో సైతం లభ్యమవుతున్నాయి. మొత్తం పనిని ఇప్పటికన్నా తక్కువ ధరకు అప్పగించాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యం. తద్వారా వందలకోట్లు ఆదా చేయడమే కాకుండా గడువులోగా ప్రాజెక్ట్‌ను పూర్తిచేయానే లక్ష్యాన్ని నిర్దేశించింది.
polavaram tenders
ఇప్పటివరకూ నిర్వహిస్తున్న టెండర్లలో టెక్నికల్‌ బిడ్‌ తెరుస్తారు. టెండర్‌ డాక్యుమెంట్ల పేర్కొన్న అర్హతలకు విరుద్ధంగా ఎవరైనా బిడ్‌ దాఖలు చేస్తే ఆ కాంట్రాక్టర్‌పై అనర్హత వేటు వేస్తారు. అర్హత సాధించిన కాంట్రాక్టర్ల బిడ్‌ను ఫైనాన్స్‌ బిడ్‌లో తెరిచి తక్కువ ధరకు కోట్‌ చేసిన కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాలని సీవోటీకి ప్రతిపాదనలు పంపుతారు. సీవోటీ ఆమోదించిన తర్వాత ఆ పనులను కాంట్రాక్టర్‌కు అప్పగిస్తూ ఒప్పందం చేసుకుంటారు.
రివర్స్‌ టెండర్‌ నోటిఫికేషన్‌లో టెండర్‌ డాక్యుమెంట్లో పేర్కొన్న అర్హతలు తమకు ఉన్నాయంటూ కాంట్రాక్టర్లే సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇవ్వాలని నిబంధన పెట్టారు. సెల్ఫ్‌ డిక్లరేషన్‌లో తప్పులుంటే కాంట్రాక్టర్‌ చెల్లించిన బ్యాంకు గ్యారంటీ (అంచనా వ్యయంలో రూ. 2.5శాతం), ఈఎండీ (ఎర్నెస్ట్‌ డిపాజిట్‌ మనీ అంచనా వ్యయంలో ఒక శాతం)ను జప్తుచేసి ప్రభుత్వ ఖజనాలో జమ చేస్తామని షరతు విధించారు. టెండర్‌ డాక్యుమెంట్లో పేర్కొన్న అర్హతలను రివర్స్‌ టెండరింగ్‌ సాఫ్ట్‌వేర్‌లో పొందుపరిచారు. బిడ్‌ దాఖలకు చివరి రోజున కాంట్రాక్టర్‌ సెల్ఫ్‌ డిక్లరేషన్‌తో పాటు బ్యాంకు గ్యారంటీ, ఈఎండీను అధికారులకు అందచేయాలి. ఆ తర్వాత రివర్స్‌ టెండరింగ్‌లో సాఫ్ట్‌వేర్‌లో పొందుపరిచిన టెండర్‌ అర్హత ఆధారంగా కాంట్రాక్టర్లను ఫైనాన్స్‌ బిడ్‌కు ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ వెబ్‌సైట్‌ ఆటోమేటిక్‌గా ఎంపిక చేస్తుంది. అర్హత సాధించని కాంట్రాక్టర్లపై వేటు వేసి బ్యాంకు గ్యారంటీ, ఈఎండీలను జప్తు చేస్తారు. అర్హత సాధించిన కాంట్రాక్టర్లు దాఖలు చేసిన షెడ్యూళ్లను ఫైనాన్స్‌ బిడ్‌లో తెరుస్తారు. తక్కువ ధరకు కోట్‌ చేసిన కాంట్రాక్టర్‌ను ఎల్‌-1గా ఎంపిక చేసి ఆ కాంట్రాక్టర్‌ పేరును గోప్యంగా ఉంచి ఆయన కోట్‌చేసిన ధరను మాత్రమే ఈ -ప్రొక్యూర్‌మెంట్‌ వెబ్‌సైట్లో పొందుపరిచి ఫైనాన్స్‌ బిడ్‌కు అర్హత సాధించిన కాంట్రాక్టర్లకు ఈ-ఆక్షన్‌ నిర్వహిస్తారు. ప్రతి 15 నిమిషాలకు ఒక స్లాట్‌ చొప్పున 2.45 గంటల పాటు ఈ-ఆక్షన్‌ నిర్వహిస్తారు. అంచనా వ్యయంలో కనీసం 0.5శాతం తక్కువ ధరను కోట్‌ చేస్తూ ఈ-ఆక్షన్‌లో పాల్గొనాలి. ఈ-ఆక్షన్‌ ముగిసిన తరవాత అత్యంత తక్కువ ధరకు వేలం పాడిన కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసి ఆ కాంట్రాక్టర్‌ అర్హతను మరోసారి పరిశీలించి అన్నీ సక్రమంగా ఉంటే పనులు అప్పగిస్తారు. లేదంటే ఈ-ఆక్షన్‌లో తక్కువ ధరకు కోట్‌ చేసిన వారిలో రెండో స్థానంలో నిలిచిన కాంట్రాక్టర్‌ పేర్కొన్న ధరలను ఐబీఎంగా నిర్ణయించి మళ్లీ ఈ-ఆక్షన్‌ నిర్వహించి అర్హుడైన కాంట్రాక్టర్‌కు పనులు అప్పగిస్తారు.
ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ రివర్స్‌ టెండరింగ్‌ అత్యంత పారదర్శకతతో కూడినదని రిటైర్డు ఈఎన్‌సీు సుబ్బరాయశర్మ, పీటర్‌, ఎల్‌.నారాయణరెడ్డి, అబ్దుల్‌ బషీర్‌, రిటైర్డు సీఈ ఐఎస్‌ఎన్‌ రాజు, సూర్యప్రకాశ్‌, ఏపీ జెన్‌కో డైరెక్టర్‌ ఆదిశేషు వంటి నిపుణులు తేల్చిచెప్పారు. 2017 డిసెంబర్‌లో అంచనా విలువ కంటే 4.85 శాతం అధిక ధరకు కోట్‌ చేస్తూ రూ. 3216.11 కోట్లకు పోలవరం జలవిద్యుత్‌ కేంద్రం పనులును ఓ సంస్థ దక్కించుకుంది. ఆ తర్వాత హెడ్‌వర్స్స్‌లో ట్రాన్స్‌ట్రాయ్‌పై వేటు వేసిన చంద్రబాబు రూ. 2914 కోట్ల పనులును ఓ సంస్థకు, రూ. 387 కోట్ల పనులును మరో సంస్థకు అంటే రూ. 3302 కోట్ల పనులను నామినేషన్‌ పద్ధతిలో అప్పగించారు. జలవిద్యుత్‌ కేంద్రం పనులు చేయకుండానే రూ. 787.20 కోట్లను ఓ సంస్థ దోచుకుంది. హెడ్‌వర్స్క్‌లో ఆ రెండు సంస్థలు చేయగా రూ. 1771.44 కోట్ల పనులు మిగిలాయి. మిగిలిన ఆ పనుల విలువనే ఐబీఎంగా నిర్ణయించి రివర్స్‌ టెండర్‌ నిర్వహించడం, అధికశాతం మంది కాంట్రాక్టర్లు పోటీ పడేలా నిబంధనలు సడలించడం వల్ల కనీసం పది నుంచి 20 శాతం తక్కువ ధరకు కోట్‌ చేస్తూ షెడ్యూళ్లు దాఖలు చేసే అవకాశం ఉంది. దీనివల్ల వందల కోట్లు ప్రభుత్వ ఖజానాకు ఆదా అవుతాయి.
https://www.youtube.com/watch?v=yAuS1tsdCSg

Recent Articles English

Gallery

Recent Articles Telugu