డైరెక్టర్ సంపత్ నంది నిర్మాతగా తెరకెక్కిస్తున్న చిత్రం “పేపర్ బాయ్”. ఈ చిత్రంలో సంతోష్ శోభన్, రియా సుమన్‌లు జంటగా నటించారు. “ఏమైంది ఈవేళ” సినిమాతో దర్శకుడిగా తన టాలెంట్ చూపించాడు సంపత్ నంది. రచ్చ, బెంగాల్ టైగర్ సినిమాలతో మాస్ డైరెక్టర్‌గానూ తన టాలెంట్ చూపించాడు. ఈ సినిమాతో నిర్మాతగానూ సక్సెస్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో ఆది హీరోగా గాలిపటం మూవీ నిర్మించిన సంపత్ నంది…తాజాగా “పేపర్ బాయ్”ను రూపొందించారు.
సంపత్ నంది అందించిన కథతో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌లో డైలాగ్‌లు ప్రేక్షకులను ఆకట్టుకునే ఉన్నాయి. ధరణి నేను చదివిన మొట్టమొదటి కవిత ఈ మూడక్షరాలు.. “నాకు పరిచయమైంది పుస్తకాల్లో..దగ్గరైంది అక్షరాల్లో” “ప్రేమంటే ఆక్సిజన్‌లాంటిది అది కనిపించదు.. కానీ బతికిస్తుంది”.. “ఈ ప్రపంచంలో ఏ ఇద్దరి ప్రపంచం ఒకేలా ఉండదనుకున్నా.. కానీ ఆ అక్షరాలు చూశాక మా ఇద్దరి ప్రపంచం ఒక్కటే అనిపించింది”.. “ముద్దు పెట్టుకోవడమంటే పెదాలు మార్చుకోవడం కాదు, ఊపిరి మార్చుకోవడం” లాంటి డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. భీమ్స్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ట్రైలర్ చూస్తుంటే రోటీన్ ప్రేమ కథే అయినా కొత్తకోణంలో తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. ఈ సినిమాకు జయ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చేనెల 7న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.