HomeTelugu Newsపెళ్లి పై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్‌ ఏమన్నాడంటే...

పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్‌ ఏమన్నాడంటే…

బాహుబలి చిత్రంతో వరల్డ్‌ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ పెళ్లి కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘డార్లింగ్‌’ ను త్వరలోనే ఓ ఇంటి వాడిని చేయాలి అనుకుంటున్నట్లు ఆయన పెదనాన్న, సీనియర్‌ నటుడు కృష్ణంరాజు కూడా ఓ సందర్భంలో చెప్పారు. సరైన వధువు కోసం చూస్తున్నట్లు పేర్కొన్నారు.

9 6

అయితే తాజాగా ప్రభాస్‌ ఓ ఆంగ్లపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పెళ్లి గురించి ప్రశ్నించగా ఆయన స్పందించారు. ‘అది నా వ్యక్తిగత విషయం. దాని గురించి చెప్పడం నాకు ఇష్టంలేదు, చెప్పాలి అనుకోవడం లేదు. నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు మీడియాకు చెబుతాను’ అని పేర్కొన్నారు.

ప్రభాస్‌ ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ తర్వాత ‘సాహో’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌ నటి శ్రద్ధాకపూర్‌ ఈ చిత్రంలో కథానాయిక. యూవీ క్రియేషన్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న చిత్రమిది. యాక్షన్‌ సన్నివేశాలకు చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇందులో జాకీ ష్రాఫ్‌, నీల్‌ నితిన్‌ ముఖేష్‌, మందిరా బేడీ, చుంకీ పాండే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu