Sobhita Dhulipala acting post wedding:
టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహం డిసెంబర్ 4, 2024న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో అట్టహాసంగా జరిగింది. సంప్రదాయ మాదిరిగా నిర్వహించిన ఈ వేడుక అందరి దృష్టిని ఆకర్షించింది.
నవంబర్‌లోనే పెళ్లి ముందు వేడుకలు ప్రారంభమయ్యాయి. శోభిత తన హల్దీ, పెళ్లి కూతురు ఫంక్షన్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ ఫోటోలు బాగానే వైరల్ అయ్యాయి. మరోవైపు వివాహం తర్వాత శోభిత నటనకు వీడ్కోలు చెబుతుందా అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి.
#NagaChaitanya and #SobhitaDhulipala are now husband and wife pic.twitter.com/EvpJsoJgW1
— KLAPBOARD (@klapboardpost) December 4, 2024
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చైతూ దీనిపై స్పందిస్తూ, “అవును, ఆమె తన నటనను కొనసాగిస్తుంది!” అంటూ సమాధానమిచ్చాడు. అంతేకాకుండా, శోభిత కుటుంబం ఎంతో ఆదరణతో, ఆత్మీయంగా ఉందని తెలిపారు.
నాగచైతన్య, శోభిత తొలిసారి ముంబైలో ఓ వర్క్ ఈవెంట్‌లో కలుసుకున్నారట. చైతూ మాట్లాడుతూ, “మేం మొదట ఓ ఓటీటీ ఈవెంట్‌లో మాట్లాడుకున్నాం. అక్కడి నుంచే మా స్నేహం మొదలైంది,” అని చెప్పాడు. 2022లో వీరి యూరప్ ట్రిప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారి ప్రేమ వ్యవహారం ప్రచారంలోకి వచ్చింది. 2023లో లండన్ రెస్టారెంట్‌లో వీరి ఫోటోలు మరింత చర్చకు దారితీశాయి.
వివాహం తర్వాత చైతూ “తండెల్” అనే సినిమాతో 2025 ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరోవైపు, శోభిత తన సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దంగా ఉంది.