Homeతెలుగు Newsపెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించిన ఏపీ ప్రభుత్వం

పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించిన ఏపీ ప్రభుత్వం

“ప్రజలే ముందు”(పీపుల్ ఫస్ట్) అనేది తెలుగుదేశం పార్టీ నినాదం అన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందుకే పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు రూ.2 చొప్పున వ్యాట్‌ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం శాసనసభలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ రోజు మంగళవారం ఉదయంనుంచే ఇది అమల్లోకి రానుంది. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు ఏడాదికి రూ.1,120 కోట్ల ఆదాయం తగ్గనుంది. ‘ప్రజలపై కేంద్రం మోపిన ఆర్థిక భారం నుంచి ఉపశమనం కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. కేంద్రం కూడా ధరలు తగ్గించాల్సిందే. ఇది సవాలు. వారు స్పందించాల’ని అన్నారు. పెట్రో ధరల పెంపుపై దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నా బీజేపీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని ధ్వజమెత్తారు. అస్తవ్యస్త పాలన వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని దుయ్యబట్టారు. పెట్రో ధరలపై చర్చ సందర్భంగా వ్యాట్‌ తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని శాసనసభ అభినందించింది. కేంద్రం కూడా బాధ్యతగా ఎక్సైజ్‌ పన్ను, సెస్‌ గణనీయంగా తగ్గించడంతోపాటు ఉపశమన చర్యలు చేపట్టాలని తీర్మానించింది. ‘చమురు సంస్థలు రోజురోజుకు పెట్రోలు, డీజిల్‌ ధరలను విపరీతంగా పెంచడంపై దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ప్రతిపక్షాల బంద్‌కు వచ్చిన విశేష స్పందనే దీనికి నిదర్శనం’ అని చంద్రబాబు పేర్కొన్నారు. పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్‌ పన్ను, డివిడెండ్ల రూపంలో నాలుగేళ్లలో రూ.23లక్షల కోట్లకుపైగా వసూలు చేశారు. ఏమైందీ సొమ్మంతా? ఎక్కడ ఖర్చు పెట్టారు? శ్వేతపత్రం విడుదల చేయండి’ అని డిమాండ్‌ చేశారు. ముడిచమురు గరిష్ఠ స్థాయికి వెళ్లలేదు. 117 డాలర్లు.. ఆపైకి వెళ్లే పరిస్థితి ఉంది. అప్పుడు చాలా సమస్యలొస్తాయి అని చంద్రబాబు ఆందోళన వెలిబుచ్చారు.

1 12

కేంద్రం అబద్ధపు ప్రచారం.. అంతర్జాతీయ విపణిలో పెట్రోలియం ధరలు పెరగడం, రాష్ట్రాలు వ్యాట్‌ పెంచడం వల్ల ధరలు పెరిగాయని కేంద్రం అబద్ధపు ప్రచారం చేస్తోందని చంద్రబాబు ఆగ్రహించారు. కేంద్రంలో బీజీపీ వచ్చాకే భారీగా ఎక్సైజ్‌ పన్నులు వేయడంతోపాటు రహదారి, మౌలిక సదుపాయాల పేరుతో సెస్‌లు వసూలు చేస్తున్నదని గుర్తు చేశారు. నాలుగేళ్లలో రూ.23లక్షల కోట్లకుపైగా వసూలు చేశారని వివరించారు. పెట్రో ధరల పెరుగుదలకు కేంద్రం ఏకపక్ష విధానాలే కారణం. నిరంకుశంగా వ్యవహరిస్తోంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసుల మాఫీ కోసమే వైఎస్‌ఆర్‌ కేంద్రానికి సహకరిస్తోంది. అది ఒక పార్టీయేనా? పెట్రోధరలు పెరుగుతుంటే కనిపించదా? నిరసనలు చేయాలనే ఆలోచన కూడా లేదు అని ధ్వజమెత్తారు. బీజీపీ ఆడిస్తున్న పార్టీలు తప్పితే అన్ని పార్టీలు ఈ ధరలపై ఆందోళన చేస్తున్నాయని గుర్తు చేశారు. జగన్‌కు, తమకు సంబంధం లేదని విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్యానించినప్పుడు చంద్రబాబు జోక్యం చేసుకుంటూ.. మీకు తెలుసా? చూపించమంటారా? అని ప్రశ్నించారు.

1a 3

రహదారులకు మళ్లీ వసూళ్లా?.. రహదారులు, మౌలిక సౌకర్యాల పేరుతో లీటరు పెట్రోలుపై రూ.7, డీజిల్‌పై రూ.8 పన్ను వేస్తున్నారు. అయినా రహదారులను బీఓటీ విధానంలో నిర్మించి ప్రజల నుంచి సొమ్ము వసూలు చేస్తున్నారు అని చంద్రబాబు పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఖాయిలాపడి నిరర్ధక ఆస్తులు పెరుగుతున్నాయి. రూ.4వేల కోట్ల ఆస్తి రూ.500 కోట్ల కింద కట్టబెడుతున్నారు. దీనివల్ల బ్యాంకులు దివాలా తీస్తున్నాయి. ఇదంతా ప్రజల డబ్బు.. అని వివరించారు. చరిత్రలో ఎన్నడూలేని విధంగా డాలర్‌కు రూపాయి మారకం ధర రూ.73 చేరువలో ఉంది. 2014లో ఇది రూ.56 మాత్రమే. 2022 నాటికి రూ.98 చేరుతుందని అంచనా. ఇదేనా మీ పాలన? అని ప్రశ్నించారు. ఆపరేషన్‌ గరుడపై మేం చెప్పించలేదు. తప్పుడు కేసులు పెట్టించాలని మీరే శతథా ప్రయత్నిస్తున్నారు. ఆదాయపన్ను శాఖ, సీబీఐని దుర్వినియోగం చేయడం మంచిది కాదు అని హితవు పలికారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu