ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్ ? మరియు నేపథ్యం విషయానికి వస్తే.. ‘పెంచికలపాడు జయరాం’.. మరి ప్రస్తుతం ప్రజల్లో పెంచికలపాడు జయరాం పరిస్థితేంటి ?, వచ్చే ఎన్నికల్లో పెంచికలపాడు జయరాం గ్రాఫ్ ఎలా ఉండబోతుంది ?, అసలు ఆయన నేపథ్యం ఏమిటి ? తెలుసుకుందాం రండి. గుమ్మనూరు జయరాంగా ఏపీ రాజకీయాల్లో సుప్రసిద్ధమైన పెంచికలపాడు జయరాం ఉమ్మడి కర్నూల్ జిల్లా చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామంలో మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం జయరాం 10వ తరగతి వరకు చదువుకున్నారు. జయరాం కుటుంబం తొలినాళ్లలో టీడీపీలో ఉండేది. జయరాం 2001లో టీడీపీ పార్టీ నుండి ఏదూరు గ్రామ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైనా 2006లో చిప్పగిరి జెడ్పీటీసీ విజయం సాధించడం జరిగింది.
2008 లో నియోజకవర్గ పునర్విభజన తర్వాత ఆలూరు నియోజకవర్గం జనరల్ స్థానంలోకి మారడంతో జయరాం టీడీపీకి రాజీనామా చేసి చిరంజీవి ప్రజారాజ్యం లో చేరి 20019 ఎన్నికల్లో అదే పార్టీ నుండి ఆలూరు లో పోటీ చేసి ఓటమి చవిచూశారు. దాంతో 2012లో జగన్ సమక్షంలో వైసీపీలో చేరి 2014, 2019లలో ఆలూరు నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019లో జగన్ మంత్రివర్గంలో కార్మిక, ఉపాధిశిక్షణ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2022లో జరిగిన మంత్రివర్గ విస్తరణలో పరిశ్రమల శాఖ బాధ్యతలు సైతం స్వీకరించారు.
ఇంతకీ రాజకీయ నాయకుడిగా పెంచికలపాడు జయరాం గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో పెంచికలపాడు జయరాం పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో పెంచికలపాడు జయరాం పరిస్థితి ఎలా ఉండబోతుంది ?, ఇప్పుడున్న సమాచారం ప్రకారం.. పెంచికలపాడు జయరాం మళ్ళీ గెలిచి అవకాశం ఉంది. ప్రజల్లో పెంచికలపాడు జయరాం పై అభిమానం ఉంది. దీనికితోడు ఆర్థిక , అంగ బలం కలిగి ఉన్న పెంచికలపాడు జయరాం జిల్లా మెట్ట రాజకీయాల్లో కీలకమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. కాబట్టి, పార్టీలతో పాటు జగన్ రెడ్డి పై ఉన్న వ్యతిరేఖత తో కూడా సంబంధం లేకుండా పెంచికలపాడు జయరాం కచ్చితంగా గెలుస్తాడు.
కాకపోతే, జయరాం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు అనేక వివాదాల్లో ఇరుక్కొని వైసీపీ అధిష్టానం వద్ద తనకున్న మంచి పేరును పోగొట్టుకుంటూ వస్తున్నారు. జగన్ రెడ్డి కూడా ఈ విషయంలో పెంచికలపాడు జయరాం పై అసంతృప్తిగా ఉన్నారు. కానీ ప్రజల్లో జయరాంకి ఉన్న పాజిటివ్ గ్రాఫ్ కారణంగా జగన్ రెడ్డి ఆయనకు కీలక పదవి ఇవ్వక తప్పలేదు. మొత్తమ్మీద పెంచికలపాడు జయరాం రాజకీయ పరిస్థితి ప్రస్తుతం బాగుంది.