HomeTelugu Newsపుస్తక ప్రియురాలిగా మారిన సోనాలి బింద్రే

పుస్తక ప్రియురాలిగా మారిన సోనాలి బింద్రే

ప్రముఖ నటి సోనాలి బింద్రే హైగ్రేడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. క్యాన్సర్‌ అనగానే చాలామంది మానసిక శక్తిని కోల్పోతారు. వారికి ఏదో అయిపోతున్నాట్లుగా ఫీలవుతారు. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక వైద్యరంగం బాగా అభివృద్ధిలోకి వచ్చింది. క్యాన్సర్ కు మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ మానసికంగా కృంగిపోతుంటారు. అయితే సోనాలి బింద్రే అలాకాదు.తనకు క్యాన్సర్ ఉన్నది అని తెలియగానే.. డీలా పడిపోలేదు. ధైర్యాన్ని కూడగట్టుకుంది. ప్రస్తుతం అమెరికాలో చికిత్స పొందుతున్నది.

12 5

తన చుట్టూ ఎప్పుడు స్నేహితులు ఉంటూనే ఉన్నారు. స్నేహితులు ఇస్తున్న భరోసాతో మానసికంగా సోనాలి మానసిక ధైర్యాన్ని ప్రోది చేసుకున్నది. సమయం దొరికినప్పుడల్లా స్నేహితులతో గడుపుతున్నది. అంతేకాదు, సోనాలి ఇప్పుడు పుస్తక ప్రియురాలిగా మారిపోయింది. మొదటి నుంచి సోనాలికి బుక్స్ అంటే చాలా ఇష్టం. ఏ మాత్రం సమయం దొరికినా బుక్ తిరగేస్తుంది. మోడ్రన్ గురుకుల్ మై ఎక్స్పీఎరియన్స్ విత్ పేరెంటింగ్ పేరుతో ఓ బుక్ ను కూడా రాసింది. ఇప్పుడు అమెరికాలో బుక్ స్టోర్ కు వెళ్లి తనకు కావాల్సిన బుక్స్ తెచ్చుకొని చదువుతుంది. అలా బుక్ స్టోర్ లో ఉండగా క్లిక్ మనిపించింది ఫోటో ఇది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu