మెగా డాటర్ నిహారిక ‘సైరా’ నరసింహా రెడ్డి చిత్రంలో ఓ గిరిజన యువతి పాత్ర చేస్తోందట. చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘సైరా’ నరసింహారెడ్డి ఈ చిత్రాని చరణ్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ప్రతిష్టాత్మక చిత్రం కాబట్టి అందులో ఎలాగైనా సరే చిన్న పాత్ర అయినా చేయాలని ఆశపడిందట నిహారికి అందుకే సైరా నిర్మాత అయిన చరణ్ ని కాళ్ళు పట్టుకొని మరీ బ్రతిమిలాడిందట నిహారిక సరిగ్గా అదే సమయంలో దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా రావడంతో నిహారికని తప్పనిసరిగా మన సినిమాలో ఉంచాలని ఓ గిరిజన యువతి పాత్ర ఇచ్చాడట.
ఈ విషయాన్ని స్వయంగా నిహారిక వెల్లడించడం విశేషం. ఈ సినిమా నటించడం నా అదృష్టమని అంటోంది నిహారిక. కాగా నిహారిక తాజా నటించిన చిత్రం హ్యాపీ వెడ్డింగ్. ఈనెల 28న విడుదల అవుతోంది. కాగా ఆ సినిమా విజయం పట్ల నమ్మకంగా ఉంది నిహారిక. ఈ భామ ఒక మనసు చిత్రంతో హీరోయిన్ గా పరిచయ మయ్యింది కానీ ఆ సినిమా ఘోర పరాజయం పొందడంతో కొంత గ్యాప్ తీసుకుని హ్యాపీ వెడ్డింగ్ తో వస్తోంది.