మన దేశంలోని సినిమాలను తమ దేశంలో తాత్కాలికంగా ప్రదర్శించవద్దంటూ పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన జీవో కాపీని పాక్ ఉన్నతాధికారి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా సరిహద్దుల్లో కాల్పుల విరమణను ప్రకటించిన భారత్ శాంతి సందేశాన్ని పాకిస్థాన్‌కు పంపింది. పాక్ మాత్రం తన వక్రబుద్ధిని మరోసారి బయట పెట్టింది. భారతీయ సినిమాలపై తమ దేశంలో పాక్ నిషేధం విధించింది.
ఈద్ ఉల్ ఫితర్, ఈద్ ఉల్ అజా సమయంలో భారతీయ సినిమాలను ప్రదర్శించొద్దని, నిషేధం ముగిశాక మళ్లీ ప్రదర్శించుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. భారతీయ సినిమాలతో పాటు ఇతర దేశాల సినిమాలతో పాక్ సినిమాలకు వసూళ్లు భారీగా పడిపోతున్నాయట. అందుకే పాక్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అక్కడి అధికారులు చెబుతున్నారు. భారతీయ సినిమాలకు పాక్‌లో అభిమానులు ఎక్కువగా ఉండటం కూడా దీనికి కారణం కావొచ్చు.