జపసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఓటు హక్కును పశ్చిమగోదావరి జిల్లాలో నమోదు చేయించుకున్నారు. గతనెల 17వ తారీఖున ఓటుహక్కు వచ్చింది. పవన్‌కు టీడీజెడ్ 117567 నంబరుతో ఓటరు గుర్తింపు కార్డు మంజూరు చేశారు. నగరంలోని పోస్టల్‌కాలనీ ఇంటినెంబరు 27-21-19తో చిరునామాతో ఈ కార్డు మంజూరైంది. పోస్టల్ కాలనీలో ఓ ఇంటిని జనసేనాని అద్దెకు తీసుకున్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అంతకు ముందు పశ్చిమగోదావరి జిల్లా నుంచి పోటీ చేస్తానని ఇదివరకు పవన్ ప్రకటించారు. ఏలూరు నుంచి పోటీ చేయాలని కోరుతున్నామని స్థానిక నాయకులు చెబుతున్నారు