ఇవాళ కర్నూలులో ధర్మపోరాటదీక్ష సభలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మొన్నటి వరకు పవన్‌కు తాను మంచిగా కనిపించానని, ఇప్పుడు అలా కనిపించడం లేదని అన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ వంటివారితో జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు అన్నారు. టీడీపీని బలహీనపరిచేందుకు బీజేపీ ఇంకో రెండో, మూడో పార్టీలు పెట్టిస్తుందని బాబు ఎద్దేవా చేశారు. ఇక.. ప్రతి శుక్రవారం కోర్టు బోనులో నిలబడే నేతలను కూడా తనను విమర్శిస్తున్నారని బాబు అసహనం వ్యక్తం చేశారు. కేసుల కోసం రాజీపడి బీజేపీని విమర్శించకుండా తనను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ‘టీడీపీని బలహీనపరచడం ఎవరి వల్లా కాదు. టీడీపీ ఎవరికీ భయపడదు’ అని స్పష్టం చేశారు. ‘కాంగ్రెస్‌తో ఎప్పటికీ లాలూచీ పడను…కాంగ్రెస్ అన్యాయం చేసిందని ఎప్పుడో చెప్పాడు. హక్కుల సాధన కోసం అందరి సహకారం తీసుకుంటాం. అంతవరకే పరిమితం’ అని చంద్రబాబు చెప్పారు.