సినిమా : పంతం
నటీనటులు : గోపీచంద్, మెహరీన్, సంపత్, జేపీ, తనికెళ్ల భరణి..
పవిత్ర లోకేష్, ప్రభాస్ శ్రీను, హంసా నందిని, ప్రభాకర్ తదితరులు
దర్శకత్వం : కె. చక్రవర్తి
నిర్మాతలు : కేకే రాధామోహన్
సంగీతం : గోపీ సుందర్
గోపీచంద్ హీరోగా నటిస్తున్న చిత్రం “పంతం” “ఫర్ ఎ కాజ్” అన్నది ఉపశీర్షిక. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో మెహరీన్ కథానాయికగా నటించారు. చక్రవర్తి ఈ చిత్రానికి దర్వకత్వం వహించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మించారు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న హీరో గోపీచంద్ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. తాజాగా పంతం అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. గోపీచంద్‌కు ఇది 25వ సినిమా.. ‘పంతం’ తోనైనా గోపీచంద్ హిట్ అందుకోవాలని ఆశిస్తూ… రివ్యూ చూద్దాం.
కథ: లండన్‌లో ఉండే భారతీయ వ్యాపారవేత్త (ముఖేష్ రుషి) ఆనంద్ సురానా వారసుడు హీరో విక్రాంత్ (గోపీచంద్). ఆనంద్ సురానాకు దానధర్మాలు చేయటం ఇష్టం ఉండదు. తన భార్య దుర్గాదేవిది (పవిత్రా లోకేష్) దానధర్మాల చేసే త్తత్వం. దాని కారణంగా ఆనంద్ ఇండియా నుంచి వ్యాపారాలను ఫ్యామిలినీ లండన్ తీసుకెళ్లిపోతాడు. విక్రాంత్ తల్లి బాటలో నడిచే కొడుకు. ఇండియాలో తల్లి ఏర్పాటు చేసిన ట్రస్ట్ కోసం తిరిగి వస్తాడు. మినిష్టర్స్ దగ్గర ఉన్న సొమ్మును ఎంతో తెలివితో దొంగలిస్తుంటాడు. ఆ సొమ్మును స్వచ్ఛంద సంస్థకు ఇస్తాడు. ఈ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సాహయం అందుతుంది. అంతే కాక తాను నివాసం ఉంటున్న ఎరియాను కూడా బాగుచేస్తాడు. అయితే విక్రాంత్ వల్ల నష్టపోయిన మంత్రులు (సంపత్) జయేంద్ర, (జయప్రకాశ్) ఆరోగ్యరావు. వీరికి హీరోకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి, వీళ్లనే ఎందుకు హీరో టార్గెట్ చేస్తాడు, అసలు అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు అన్నదే కథలోని అంశం.
నటీనటులు: యాక్షన్ రోల్ గోపీచంద్‌కు తిరుగులేదని మరోసారి ఫ్రూవ్ చేసుకున్నాడు. అతనికి తగ్గటుగానే మాస్ కథ ఇది. కానీ కథలో పెద్దగా కొత్తదనం లేకపోవడంతో గోపీచంద్ నటన ఎప్పటీలాగానే అనిపించింది. సెకండ్ హప్‌లో చాలా స్టెలిష్‌గా ఉన్నాడు. కోర్టు సీన్‌లో గోపిచంద్ నటన సూపర్బ్ అనిపిస్తుంది. మెహరీన్‌కు ఏమాత్రం ప్రాధాన్యం లేని పాత్ర దక్కింది. ఉన్నంతలో తన వంతుగా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. నటులు సంపత్, ముఖేశ్ రుషి, జయప్రకాశ్, తనికెళ్ల భరణి ఎవరి పాత్రకు తగ్గటు వారు న్యాయం చేశారు. శ్రీనివాస్ రెడ్డి. పృథ్వీ. ప్రభాస్ శ్రీను నవ్వంచే ప్రయత్నం చేశారు. పాటలు చెప్పుకోవాలినంతగా లేవు. నేపథ్య సంగీతం, కెమెరా పనితనం ఆకట్టకున్నాయి. దర్శకుడు కొన్ని సన్నివేశాలను, సంభాషణలను బాగా రాసుకున్నాడు. కానీ ప్రేక్షకుడిని పూర్తిస్థాయిలో అలరించలేకపోయిందనే చెప్పాలి.
విశ్లేషణ: ఎప్పుడూ కొత్త తరహా కథలను ఎంపిక చేసుకునే గోపీచంద్ తన 25 సినిమా ఇటువంటి రొటీన్ కథను ఎంచుకోవడం ఆశ్చర్యం. కథలో కొత్త దనం లేదు. ఏదైనా నష్టం కలిగినప్పుడు ప్రభుత్వం ఇచ్చే సాయం ఎంతమందికి చేరుతుంది, ఈ సాయం ప్రజలకు చేరే సరికి మధ్యలో ఎంత మంది అధికారులు చేతులు తడుపు వస్తోంది అనే అంశం పై తెరకెక్కించాడు దర్శకుడు కె. చక్రవర్తి. హీరో డబ్బులు ఎత్తకుపోవడం లాంటి సన్నివేశాలను చాలా రొటీన్‌గా చూపించాడు. కొన్ని సన్నివేశాలు కిక్, శివాజీ వంటి చిత్రాలను గుర్తుచేస్తాయి. తన పాత్రకు తగ్గ న్యాయం చేసాడు గోపీచంద్.
అయితే హీరోయిజాన్ని హైలైట్ చేసే ప్రయత్నంలో లాజిక్‌లను కాస్త పక్కన పెట్టినట్టుగా అనిపిస్తుంది. విలన్ పాత్ర మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. ద్వితీయార్థంలో కొంచెం పర్వలేదని పంచింది. హీరో ఫ్లాష్‌బ్యాక్, తాను దొంగగా మారడాని దారితీసిన పరిస్థితులు, లక్ష్యం ఇవన్నీ బాగానే అనిపిస్తాయి. కొన్ని సన్నివేశల్లో గోపీచంద్ చెప్పిన యాక్షన్ డైలాగ్స్ బాగున్నాయి. కాకపోతే కథ, కథనం ఏమాత్రం లాజిక్‌కు అందకపోవడం నిరాశపరుస్తుంది. పాత సినిమాల ఛాయలు పడకుండా దర్శకుడు కొత్తగా ప్రయత్నిస్తే బాగుండేది.
హైలైట్స్
కోర్టు సీన్స్
యాక్షన్ సీన్స్
గోపీచంద్ నటన
డ్రాబ్యాక్స్
కథలో కొత్తదనం లేకపోవడం
హీరో, హీరోయిన్ మథ్య కెమిస్ట్రీ
చివరిగా : ప్రేక్షకుడిని పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
(గమనిక : ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)