HomeTelugu Reviewsనేల టిక్కెట్టు సినిమా రివ్యూ

నేల టిక్కెట్టు సినిమా రివ్యూ

సినిమా : నేలటిక్కెట్టు
నటులు : రవితేజ, మాళవికా శర్మ, జగపతిబాబు, అలీ, పోసాని కృష్ణమురళి తదితరులు
సంగీతం : శక్తినాథ్‌ కార్తిక్‌
సినిమాటోగ్రాఫర్‌ : ముఖేశ్‌
కూర్పు : చింత కె ప్రసాద్‌
దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ కురసాల
నిర్మాత : రామ్‌ తాళ్లూరి , రజనీ తాళ్లూరి
బ్యానర్ : ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
విడుదల తేదీ : 25 మే 2018

4 8

ఒకప్పుడు వరుస విజయాలకు కేరాఫ్‌ అడ్రస్‌ రవితేజ. ఆయనతో సినిమా చేస్తున్నామంటే దర్శక-నిర్మాతలు ఏ విషయంలోనూ పెద్దగా ఇబ్బంది పడాల్సినవసరం ఉండేది కాదు. మాస్‌ ప్రేక్షకులతో పాటు, కుటుంబ ప్రేక్షకులను రవితేజ సినిమాలు విశేషంగా అలరించేవి. ఎవరి కెరీర్‌లోనైనా జయాపజయాలు సహజం. అవి రవితేజను పలకరించాయి. అయితే “రాజా ది గ్రేట్‌ “తో ప్రేక్షకులకు రుచి చూపించారు. ఈ జనవరిలో వచ్చిన “టచ్‌ చేసి చూడు” బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయం అందుకోలేదు. ఈ నేపధ్యంలో “సోగ్గాడే చిన్నినాయనా”, “రారండోయ్‌ వేడుక” చూద్దాం చిత్రాలతో విజయాలను అందుకున్న కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో రవితేజ నటించిన తాజా చిత్రం “నేల టిక్కెట్టు”. మాస్‌ను ఆకట్టుకునేలా సినిమాపై ఆసక్తిని రేకెత్తించారు. మరి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? రవితేజకు మరో విజయం దక్కిందా? కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వం ఆకట్టుకుందా?

కథ : ఈ సినిమాలో హీరో పేరు “నేల టిక్కెట్టు” విశాఖ లో ఇతడు ఒక అనాథ. ప్రతి మనిషిలో ఓ బంధాన్ని, బంధుత్వాలను చూసుకుంటాడు…అందరినీ ఏదో వరుసతో పిలుస్తాడు. అందరితో కలిసి సంతోషంగా ఉండాలనే రకం. ఆఖరికి దేవుడినైనా సరే. ఇలా వరుసతో పిలిచినవారి కోసం ఎంత రిస్క్‌ అయినా తీసుకుంటూ..సహాయం చేస్తాడు. మరో వైపు ఆదిత్య భూపతి (జగపతి బాబు)కు స్వార్థం ఎక్కువ. డబ్బు కోసం తన కన్నతండ్రి (శరత్‌ బాబు)ని చంపేస్తాడు. హోంమంత్రి నుంచి ముఖ్యమంత్రిగా ఎదగాలని ఎదురుచూస్తుంటాడు. ఆదిత్య భూపతికి నేల టిక్కెట్టుకి మధ్య ఎలాంటి సంఘర్షణ మొదలైంది. ఆదిత్య అక్రమాలను నేల టిక్కెట్టు ఎలా ఎదుర్కొన్నాడు?.. చుట్టూ జనం…మధ్యలో మనం. అలా ఉండాలి లైఫ్‌ అంటే అని చేప్పే జనం కోసం హీరో ఏం చేశాడన్నదే కథ

5 7

నటీనటుల పనితీరు : రవితేజ ఈచిత్రంలోనూ ఎప్పటిలాగనే చేశాడు. నటనలో కొత్తదనం కనిపించలేదు. మునుపటి కంటే లుక్స్‌ పరంగా మరింత జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉందని ప్రతి సన్నివేశంలో అర్థమవుతుంది. మాళవిక శర్మకు ఇదే తొలి చిత్రం. చూడ్డానికి బాగానే ఉన్నా రవితేజతో పాటు ఆమె కెమిస్ర్టీ అంతగా పండలేదనే చెప్పాలి. జగపతి బాబు రొటీన్‌ ప్రతినాయకుడి పాత్రలో కన్పించారు. ఆయన పాత్రను డీల్‌ చేసే విధానం సరిగ్గా లేదు. సీనియర్‌ నటులు చాలా మంది ఉన్నా, వాళ్లను దర్శకుడు సరిగ్గా ఉపయోగించుకోలేదు. బ్రహ్మానందం పాత్రకు ఒక్క డైలాగూ లేకపోవడం ఇందుకు అద్దం పట్టింది. శక్తినాథ్‌ సంగీతంలో స్ఫీడ్‌ తగ్గిందనిపించింది. “ఫిదా” కు సంగీతం సమకూర్చింది ఈ దర్శకుడేనా అనిపించింది. పాటలేవీ చెవికి ఇంపుగా అనిపించలేదు. దరువు ఎక్కువగా అనిపించింది. సాహిత్యం కనిపించలేదు.

దర్శకత్వం : “సోగ్గాడే చిన్నినాయనా”, “రారండోయ్‌ వేడుక చూద్దాం ” సినిమాలు తీసిన దర్శకుడేనా? అనే సందేహం ప్రేక్షకులకు సినిమా ప్రారంభమైన పావుగంటలోనే వస్తుంది. ఇది వాళ్ల తప్పు కాదు, ముమ్మాటికీ దర్శకుడి తప్పే. తెరనిండుగా ఆర్టిస్టులు కనబడతారు. ఒక సన్నివేశంలోనూ డెప్త్‌ లేదు. ఒక సన్నివేశాన్ని కూడా ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా తీయలేకపోయాడనిపిస్తుంది.

విశ్లేషణ : ఒక అనాథ అధికార దాహంతో, డబ్బు సంపాదన మాత్రమే ధ్యేయంగా పెరిగి పెద్దయితే ఎలా ఉంటాడు? మరో అనాథ అందర్నీ ఆప్తులు అనుకుంటూ పెరిగితే ఎలా ఉంటాడు? అనేది కథ! అందులో ఓ అనాథ హోమ్‌ మినిస్టర్‌ కమ్‌ విలన్‌ జగపతి బాబు అయితే ….మరో అనాథ రవితేజ. ఈ ఇద్దరి మధ్య పోరాటమే ఈ సినిమా. దీన్ని దర్శకుడు నేరుగా చెప్పకుండా మలుపులు తిప్పుతూ ఒక్కో ట్విస్ట్‌ విడుదల చేస్తూ రెండున్నర గంటలకు పైగా సాగదీశాడు. అతను ట్విస్ట్‌ అనుకున్నప్రతీది ప్రేక్షకులను ఇబ్బంది పెట్టింది. పాటలకు సరైన సందర్భమే లేదు. ఇంటర్వెల్‌కి సినిమా కథపై ప్రేక్షకుడికి అవగాహన వచ్చేస్తుంది. ఇక సెకండాఫ్‌ ఇదే కొనసాగింది. కొన్ని సన్నివేశాలు చాలా చప్పగా ఉన్నాయి. తన నటనతో ఎంతో కొంత వినోదాన్ని అందించే రవితేజ కూడా చేతులెత్తేశాడు. దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్‌ చెప్పలేక సతమతం కావడంతో సినిమాలో గందరగోళం ఏర్పడింది.

బలాలు :
రవితేజ
చుట్టూ జనం మధ్యలో మనం అనే కాన్సెఫ్ట్‌

బలహీనతలు :
-కథ, కథనాలు
-సంగీతం
-వినోదం లేకపోవడం

(గమనిక : ఇది కేవలం వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!)

Recent Articles English

Gallery

Recent Articles Telugu