ఇటీవల భాగమతిగా అలరించిన అనుష్క ప్రస్తుతం కొత్త పాత్రల కోసం సన్నద్ధమవుతోంది. దక్షిణాదిలో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది అనుష్క. స్టార్ హోదాని ఎలా ఆస్వాదిస్తున్నారన్న ప్రశ్నకు నేను స్టార్‌ని అన్న విషయమే గుర్తుకు రాదు అంటోదంట. ప్రేక్షకులు మాపై చూపించే ప్రేమ గుర్తుకొచ్చినప్పుడు మేం పడ్డ కష్టం మర్చిపోతామని, నా పని తీరుకు తగ్గ విలువ, గౌరవం లభించాయనే భావన తప్ప మరోటి ఉండదంటోంది అనుష్క.
ఇండస్ట్రీలో ఏళ్ల తరబడి ప్రేక్షకులను అలరిస్తున్ననటులు ఎంతో మంది ఉన్నారు. నిన్నటి తరాన్ని గుర్తుచేసుకున్నప్పుడు ఎంత ఆశ్చర్యం కలుగుతుందో మాటల్లో చెప్పలేమంటోంది అనుష్క. వాళ్లు అప్పట్లో సినిమా కోసం పడ్డ కష్టం, తపన ఎంత గొప్పదో.. స్టార్ అన్నా.. సూపర్ స్టార్ అన్నా వాళ్లే.. వాళ్ల ప్రతిభ ముందు మనం ఎంత అనిపిస్తుంది అంటోంది. అప్పట్లో ఎలాంటి సౌకర్యాలు లేవు.. ఎంతో కష్టపడేవారు.. వాళ్ల కష్టం ముందు మా కష్టం తక్కువే అంటోంది అనుష్క.