త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ యన్టీఆర్ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు భారీ
యాక్షన్ సీక్వెన్స్ పూర్తి చేసుకుని శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. రేపు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ
సినిమా ఫస్ట్ లుక్ ఇవాళ సాయంత్రం విడుదల చేయనున్నారు. దీంతో పాటు సినిమా టైటిల్ నూ ప్రకటించే అవకాశముంది.
”అరవింద సమేత రాఘవ” అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.
దీన్ని బట్టి చూస్తుంటే ఎన్టీఆర్ కు పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను త్రివిక్రమ్ రెడీ చేస్తున్నట్టు అర్ధమవుతోంది. ఈ సినిమా
కోసం ఎన్టీఆర్ తన లుక్ ను మరోసారి మార్చబోతున్నాడు. హారిక హాసిని బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో
ఎన్టీఆర్ పక్కన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.