HomeTelugu Newsనెటిజన్‌కు రష్మి జవాబు

నెటిజన్‌కు రష్మి జవాబు

జబర్దస్త్‌ కామెడీ షోతో ఆకట్టుకున్న ప్రముఖ యాంకర్‌ రష్మి ఓ నెటిజన్‌ను రూ.3 కోట్లు ఇవ్వమని అడిగారు. అసలు సంగతి ఏమిటి అంటే.. ట్విటర్ వేదికగా ఓ నెటిజన్‌రష్మి సొంతంగా సినిమాలు చేసుకో సలహా ఇచ్చాడు. నిన్ను సినిమాల్లో తీసుకునే దర్శకుల కోసం ఎదురుచూడకు అని అన్నాడు. దీనికి రష్మి .. కచ్చితంగా నేను నా బ్యాంకు ఖాతా వివరాలు నీకు పంపుతా. రూ.3 కోట్లు పంపు.. గొప్ప సహాయం చేసిన వ్యక్తివి అవుతావు అని జవాబు ఇచ్చారు.

11 16

ఇదే సందర్భంగా మరో నెటిజన్‌ రష్మి ఎంచుకుంటున్న పాత్రల గురించి మాట్లాడారు. కేవలం బోల్డ్‌ గ్లామర్‌ పాత్రలకు మాత్రమే పరిమితం కావొద్దు. మీరు టీవీ షోలో యాంకరింగ్‌ చేసే విధానం, మీ కామెడీ టైమింగ్‌ మాకెంతో ఇష్టం. ఈ ఇంప్రెషన్‌ మీపై ఎప్పుడూ ఉండేలా చూసుకోండి అని అన్నారు. దీనికి రష్మి.. ఇవి రెండు పూర్తిగా విభిన్నమైన పనులు. యాంకరింగ్‌ చేయడం అంటే మన వ్యక్తిత్వాన్ని కెమెరా ముందు చూపించడం. సినిమాల్లో నటించడం అంటే ఓ పాత్రలో జీవించడం. ఒకే రకమైన పాత్రలకు పరిమితం కావాలని నేను అనుకోలేదు అని చెప్పారు.

ఇదే సందర్భంగా తన కొత్త ప్రాజెక్టుల గురించి కూడా రష్మి స్పష్టత ఇచ్చారు. ఏ సినిమా కోసం సంతకం చేయలేదని అన్నారు. రష్మి నటించిన ‘అంతకు మించి’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జానీ దర్శకుడు. జై కథానాయకుడి పాత్ర పోషించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu