ఈ ఏడాది సమ్మర్ లో రాబోయే సినిమాల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇప్పటికే డేట్లు లాక్ చేసేసుకున్నారు. ముందుగా మహేష్ బాబు-కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘భరత్ అనే నేను’ సినిమా ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘శ్రీమంతుడు’ సినిమా హిట్ అవ్వడం పైగా ఈ కథ రాజకీయ నేపధ్యంలో సాగే కథ కావడంతో అభి,అభిమానులతో పాటు ఇండస్ట్రీ కూడా ఎదురుచూస్తోంది. అయితే అదే సమయానికి హీరో నాని నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా కూడా రాబోతుంది. ఏప్రిల్ 13న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
అలా గనుక జరిగితే మహేష్ సినిమాకు కావలసినన్ని థియేటర్లు దొరకవు. దీంతో ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా రిలీజ్ డేట్ మార్చే విధంగా మహేష్ టీం ప్రయత్నాలు మొదలుపెట్టింది. మహేష్ గనుక ఆ చిత్ర నిర్మాత దిల్ రాజుని అడిగితే ఆయన కాదనరు. కాబట్టి నాని సినిమా అనుకున్న సమయానికి వచ్చే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. కనీసం ఈ రెండు సినిమాలకు రెండు వారాల గ్యాప్ అయినా ఖచ్చితంగా ఉంటుందని సమాచారం.