Homeతెలుగు వెర్షన్నానితో పాటు మరో హీరో!

నానితో పాటు మరో హీరో!

నానితో పాటు మరో హీరో!
వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని ప్రస్తుతం విరించి వర్మ దర్శకత్వంలో ‘మజ్ను’ అనే 
సినిమాలో నటిస్తున్నాడు. ఈరోజే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. 
ఫస్ట్ లుక్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ ఉందట. ఈ
పాత్రకు హీరో రాజ్ తరుణ్ అయితే కరెక్ట్ అని భావించిన దర్శకుడు అతడ్ని సంప్రదించగా 
మరో మాట లేకుండా రాజ్ తరుణ్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. రాజ్ తరుణ్ ఇది వరకు విరించి 
వర్మ దర్శకత్వంలో ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాలో నటించాడు. ఆ అభిమానంతోనే నాని సినిమాలో 
నటించడానికి సిద్ధమయ్యాడు. హీరోగా సినిమాల్లో నటిస్తున్నప్పటికీ.. గెస్ట్ రోల్ లో నటించడానికి 
ఒప్పుకోవడం విశేషమనే చెప్పాలి. 

Recent Articles English

Gallery

Recent Articles Telugu