HomeTelugu Newsనాగార్జున, నాని మూవీ టైటిల్‌ పోస్టర్‌

నాగార్జున, నాని మూవీ టైటిల్‌ పోస్టర్‌

టాలీవుడ్‌లో వరుసగా మల్టీస్టారర్‌ మూవీస్‌ వస్తున్నాయి. ఇక తాజాగా నాగార్జున, నాని హీరోలుగా తెరకెక్కుతోన్న భారీ మల్టీస్టారర్‌కు ‘దేవదాస్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. ‘ఓ మై ఫ్రెండ్‌’ ఫేం శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ గురువారం విడుదల చేసింది. ‘శాంతాబాయి మెమోరియల్‌ చారిటీ హాస్పిటల్‌’ అనే ఆస్పత్రి రసీదుపై సినిమాకు సంబంధించిన వివరాలతో పాటు.. ఓ చివర స్టెతస్కోప్‌, మరో చివర గన్‌, బుల్లెట్లతో కూడిన పోస్టర్‌ వినూత్నంగా ఉంది.

5 6

వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై అశ్వనీదత్‌ ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాలో దేవ అనే డాన్‌ పాత్రలో నాగార్జున, దాస్‌ అనే డాక్టర్‌ పాత్రలో నాని కనిపించనున్నారు. ఆకాంక్షా సింగ్‌ , రష్మిక మందన కథనాయికలుగా చేస్తున్నారు. 65 శాతానికి పైగా షూటింగ్‌ పూర్తి చేసుకుంది ఈ చిత్రం. ఈ ఫస్ట్‌ లుక్‌లో ఇద్దరు హీరోలకు మంచి న్యాయం చేసినట్లే కనిపిస్తుంది. ఈ చిత్రాన్నికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu