ఫోర్న్ స్టార్ నుంచి హీరోయిన్గా ఎదిగిన సన్నీ లియోన్ ప్రస్తుతం ‘వీరమహాదేవి’ సినిమా చేస్తుంది. ఇందులో సన్నీ వీరనారి పాత్రంలో కనిపించనుంది. ఈ సినిమా గురించి ఆమె మాట్లాడుతూ తనకు ఇలాంటి పాత్రలే చేయాలని ఉండేదని, దర్శకుడు విసి వడివుడయాన్ ఈ కథ చెప్పగానే తాను శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టానని అన్నారు.
అలాగే ఆంధ్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో తనకు చాలా మంది అభిమానులున్నారని, వారంటే తనకు ఇష్టమని, స్త్రీ పాత్ర ప్రధానంగా ఉండే కథలు చేయాలనేది తన కోరికని చెప్పుకొచ్చారు. స్టీవెన్ కార్నర్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ ‘వీరమహాదేవి’ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకానుంది.