HomeTelugu Reviews@నర్తనశాల మూవీ రివ్యూ

@నర్తనశాల మూవీ రివ్యూ

కెరీర్‌ ప్రారంభం నుంచే విభిన్నమైన కథలను ఎంపికచేసుకుంటూ.. తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నా నటుడు నాగశౌర్య. ఇప్పటి వరకు లవరబాయ్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్న నాగాశౌర్య తొలిసారి గే పాత్రను ఎంచుకోవడం విశేషం. సాధారణంగా ఇలాంటి పాత్రలను ఎంపిక చేసుకోవడానికి చాలా మంది నటులు సంకోచిస్తారు. కానీ దీన్ని ఓ సవాలుగా తీసుకున్నాడు, అలనాటి సినిమా పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగశౌర్య.. ఈ సినిమాతో మరో విజయం తన ఖాతాలో వేసుకున్నాడా? గే పాత్రలో ప్రేక్షకులను ఎంత మేరకు మెప్పిస్తాడో చూడాలి..

1a 2

కథ: హీరో నాగశౌర్యకు ఈ చిత్రంలో అతని పాత్రకు పేరు లేదు. (శివాజీ రాజా) కళామందిర్ ‌కల్యాణ్‌ అమ్మ చనిపోతుంది. దాంతో తనకు కూతురు పుడితే ఆమెను అమ్మగా చూసుకోవాలని అనుకుంటాడు. కానీ, అబ్బాయి నాగశౌర్య పుడతాడు. కూతురు పుట్టాలన్న తన ఆశ నెరవేరకపోవడంతో కొడుకునే ఆడపిల్లలా పెంచుతాడు కళామందిర్ కల్యాణ్. నాగశౌర్య పెద్దయ్యాక మహిళల కోసం ఒక ఇన్‌స్టిట్యూట్‌ పెడతాడు. కాగా ఈ టైమ్‌లో (కశ్మీరా) మానసను చూసి ఇష్టపడతాడు. ఈ నేపథ్యంలో (యామిని భాస్కర్‌) జయప్రకాశ్‌ రెడ్డి కుమార్తె సత్య తనను నాగశౌర్య ప్రేమిస్తున్నాడని భ్రమ పడుతుంది. హీరో తండ్రి కల్యాణ్‌ కూడా అదే అనుకుంటాడు. పూర్తి విషయం తెలుసుకోకుండా కల్యాణ్‌.. జయప్రకాశ్‌ రెడ్డి ఇంటికి వెళ్లి పెళ్లి సంబంధం మాట్లాడతాడు. ఇందుకు జయప్రకాశ్‌ కూడా ఒప్పుకోవడంతో పెళ్లి నిశ్చయమవుతుంది. కానీ, తాను మనసారా ప్రేమించిన మానసను మర్చిపోలేక పెళ్లి నుంచి తప్పించుకోవడానికి తాను అసలు ఏ అమ్మాయినీ ప్రేమించలేనని, తానో ‘గే’ నని చెప్తాడు నాగశౌర్య. ఆ అబద్ధం వల్ల నాగాశౌర్య జీవితం ఎలాంటి మలుపులు తిరిగుతుంది. చివరికి ఈ ప్రేమ కథ ఎక్కడ ముగుస్తుంది. అన్నదే ఈ కథలోని అంశం

నటీ, నటులు:
నాగాశౌర్య గే పాత్రను ఒప్పుకోవడంతోనే సగం మార్కులు కొట్టేశాడు. ఈ పాత్రలో అతని సత్తా అంతా చూపించగలిగాడు. నాగాశౌర్య సిగ్గుపడే సన్నివేశాలు చాలా సరదాగా అనిపిస్తాయి. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్‌లు ఉన్నా వారి పాత్రలకు పెద్ద గుర్తింపు లేదు. కేలవం పాటలకు మాత్రమే పరిమితమయ్యారు. అజయ్‌ నటన బాగుంది. రెండోవ భాగంలో కామెడీ వర్కవుట్‌ అయ్యిందంటే దానికి కారణం అజయ్‌ పాత్రే. జయప్రకాశ్‌ రెడ్డి, శివాజీ రాజావి నిడివి ఎక్కువగా ఉన్న పాత్రలు. కాకపోతే అక్కడక్కడా వారి నటన శ్రుతి మించినట్లు అనిపిస్తుంది. సత్యం రాజేశ్‌ కాసేపు నవ్విస్తాడు. ఐరా సంస్థ నిర్మించిన రెండో చిత్రం ఇది. నిర్మాణ విలువలు బాగున్నాయి. రంగుల హరివిల్లుగా పాటల్ని తీర్చిదిద్దారు. సినిమా రిచ్‌గా ఉంటుంది. రెండు, మూడు పాటలు వినడానికి, చూడ్డానికి కూడా బాగున్నాయి. దర్శకుడు రాసుకున్న పాయింట్‌ కొత్తగా ఉంది. దాన్ని ఇంకాస్త బాగా డీల్‌ చేయొచ్చు అనిపిస్తుంది. వినోద ప్రధానమైన చిత్రమిది. అయితే, ఆ సన్నివేశాలు అక్కడక్కడ మాత్రమే మెరిశాయి

1 48

విశ్లేషణ : ఇటువంటి సినిమాలు ఇంతకుముందు తెలుగులో రాలేదు. ఒక హీరో గే పాత్రలో నటించడం అరుదైన విషయం. నాగశౌర్య మరోసారి సొంత నిర్మాణ సంస్థలో సినిమా చేస్తున్నాడంటే ఆ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే అంచనాలు అందుకోవటంలో @నర్తనశాల టీం పూర్తిగా విఫలమైంది. @నర్తనశాల సినిమాలో తొలి సగభాగం అంతా హీరో పాత్ర, శివాజీ రాజా చేసే పొరపాట్లు, వాటి నుంచి పండే కామెడీ, సత్యం రాజేశ్‌ ఎపిసోడ్‌, హీరో హీరోయిన్ల లవ్‌స్టోరీపై నడిపించాడు దర్శకుడు. గే ఎపిసోడ్‌ అంతా ద్వితీయార్ధానికి కేటాయించుకున్నారు. అజయ్‌ పాత్ర రావడమే ఈ కథకు మలుపు. గే పాత్రకు సంబంధించిన ఎపిసోడ్లన్నీ బాగా పేలాయి. అలాంటి సన్నివేశాలు చూడటం కొత్త కాబట్టి ప్రేక్షకులు వాటిని బాగానే ఆస్వాదిస్తారు. కథలో వినోదాన్ని పండించే స్కోప్‌ ఉంది. దర్శకుడు ప్రతి సన్నివేశాన్నీ నవ్వించేలానే చేశాడు.

కాకపోతే ఆ నవ్వులూ వినోదమూ అంతా పైపైనే ఉంటుంది. నాన్‌స్టాప్‌గా వినోదం అందించే ఎపిసోడ్లు ఒకటి, రెండుంటాయి. అవి కూడా రెండోభాగంలోనే. అజయ్‌, నాగశౌర్య మధ్య సన్నివేశాలు వర్కవుట్‌ అయ్యాయి. అదే స్థాయిలో మిగిలిన సన్నివేశాలు కూడా ఉండుంటే ఈ చిత్రం కచ్చితంగా గుర్తుండిపోయే చిత్రం అయ్యేది. రెండోభాగంలో మొత్తం అజయ్‌ ఇంటికే పరిమితం చేయడం, ఒక కథానాయికను గదిలో బంధించడం, రెండో కథానాయిక పాత్రకు అంతగా ప్రాధాన్యం లేకపోవడం, అక్కడక్కడా నటీనటుల ఓవర్ ‌యాక్షన్‌ కథాగమనాన్ని ఇబ్బంది పెడుతుంటాయి. కథలో, సన్నివేశాల్లో పెద్దగా మలుపులేమీ ఉండవు. సినిమా అంతా ప్రేక్షకుడి ఆలోచనకు అనుగుణంగానే సాగుతుంటుంది.

1b 2

హైలైట్స్
నిర్మాణ విలువలు
రెండు పాటలు

డ్రాబ్యాక్స్
కథా కథనాలు
నటీనటుల ఓవర్ ‌యాక్షన్‌

చివరిగా : తేడాగా ఉంది
(గమనిక : ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

చిత్రం: @నర్తనశాల
న‌టీన‌టులు: నాగశౌర్య, కశ్మీరా, యామిని భాస్కర్‌, జయప్రకాశ్‌ రెడ్డి, శివాజీ రాజా, అజయ్‌, సత్యం రాజేశ్‌ తదితరులు
సంగీతం: మహతి స్వర సాగర్‌
ద‌ర్శ‌క‌త్వం: శ్రీనివాస్ చక్రవర్తి
నిర్మాత‌లు: ఉషా ముల్పూరి
సంస్థ‌: ఐరా క్రియేషన్స్‌

Recent Articles English

Gallery

Recent Articles Telugu

కెరీర్‌ ప్రారంభం నుంచే విభిన్నమైన కథలను ఎంపికచేసుకుంటూ.. తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నా నటుడు నాగశౌర్య. ఇప్పటి వరకు లవరబాయ్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్న నాగాశౌర్య తొలిసారి గే పాత్రను ఎంచుకోవడం విశేషం. సాధారణంగా ఇలాంటి పాత్రలను ఎంపిక చేసుకోవడానికి చాలా మంది నటులు సంకోచిస్తారు. కానీ దీన్ని ఓ సవాలుగా తీసుకున్నాడు, అలనాటి సినిమా పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగశౌర్య.....@నర్తనశాల మూవీ రివ్యూ