యువ నటుడు నాగశౌర్య తన సొంత బ్యానర్‌లో చేస్తోన్న రెండోవ చిత్రం ‘నర్తనశాల’. లెజెండరీ చిత్రమైన నర్తనశాల చిత్రం పేరు నిలబెట్టేలా తమ సినిమా ఉంటుందని మూవీ యూనిట్ ప్రకటించింది. తాజాగా షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది.
ఈ సినిమా టీజర్‌ను మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. ఇందులో నాగశౌర్యను గే పాత్రలో చూపించారు. ‘పెళ్లంటే.. ఫీలింగ్స్ రావాలి కదా’ అంటూ నాగశౌర్య డైలాగ్స్‌తో టీజర్ ప్రారంభమైంది. ‘చిన్నప్పటి నుంచి వాడిని ఆడపిల్లలా అలా పెంచితే ఆ ఫీలింగ్ ఎలా వస్తాయ్ చెప్పు’ అని శివాజీ రాజాకు ఓ వ్యక్తి గుర్తు చేశారు. చివర్లో ‘నా కొడుకు గేనా?..’ అని శివాజీ రాజా ఆశ్చర్యపోవడం నవ్వులు పూయిస్తోంది.