యంగ్ హీరో సుధీర్ బాబు ‘సమ్మోహనం’ సినిమాతో సూపర్ హిట్ సాధించి మరో ఆసక్తికర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థ సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఆర్‌ఎస్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ చిత్రానికి ‘నన్ను దోచుకుందువటే’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. సీనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన గులేభకావళి కథ చిత్రంలోని సూపర్ హిట్ పాట పల్లవినే ఈ సినిమాకు టైటిల్‌గా ఫిక్స్ చేశారు.ఈ సినిమాలో సుధీర్ సరసన నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తుంది.
ఈ సినిమా ఫస్ట్ లుక్‌పోస్టర్‌ను సుధీర్ తన సోషల్ మీడియా పేజ్ ద్వారా రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్‌లో కథానాయిక నభా నటేష్ టేబుల్‌పై కూర్చుని వయ్యారంగా సెల్ఫీ తీసుకుంటుంటే..పక్కనే ఉన్న సుధీర్ ఆమెను వెటకారంగా చూస్తుండడం ఆకట్టుకుంటోంది. ‘సమ్మోహనం’ సినిమాపై మీరు చూపిస్తున్న అభిమానానికి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే. మరోపక్క ఆకాశం వైపునకు ఇదే నా తొలి అడుగు, తొలి విమానం. నా నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న తొలి చిత్రం ‘నన్ను దోచుకుందువటే’ ఫస్ట్‌లుక్ ఇదిగో..!’ అని ట్వీట్ చేశారు సుధీర్.