ప్రముఖ నటి అమలా పాల్ గాయపడ్డారు. తమిళ చిత్రం ‘అధో అంధ పరవై పోలా’ షూటింగ్‌లో ఓ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తుండగా లిగ్మెంట్ టేర్ కావటంతో గాయమైనట్టుగా తెలుస్తోంది. మొదట బెణికిందని భావించిన చిత్ర బృందం ఫస్ట్‌ఎవడ్ చేసి షూటింగ్‌ను కంటిన్యూ చేశారు. క్రమేపి నొప్పి పెరగాడంతో షూటింగ్ క్యాన్సిల్ చేసి అమలా పాల్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. చేతికి కట్టు వేసిన డాక్టర్లు కొద్ది రోజుల పాటు రెస్ట్ తీసుకోవాల్సిందిగా సూచించారు. ప్రస్తుతం ఆమె కేరళలో రెస్ట్ తీసుకుంటున్నారు.