టాలీవుడ్ కింగ్ నాగార్జున ఆగస్టు 29 బుధవారం (రేపు) తన పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా నాగ్‌కు శుభాకాంక్షలు చెబుతూ ‘దేవదాస్’ చిత్ర బృందం స్టిల్స్ విడుదల చేసింది. ఇందులో నాగ్ చాలా యంగ్ లుక్‌లో అందంగా కనిపించారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. వయసు పెరుగుతున్నా.. నాగ్ అందం అలాగే ఉందని కామెంట్లు చేస్తున్నారు.
నాగార్జున, నాని హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘దేవదాస్’. ఈ చిత్రంలో రష్మిక, ఆకాంక్ష సింగ్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనిదత్ ఈ చిత్రాని నిర్మిస్తున్నారు. మణిశర్మ బాణీలు సమకూరుస్తున్నారు. కాగా ఈ చిత్రాని సెప్టెంబరు 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం నాగ్ దేవ్ పాత్రలో, నాని దాస్ పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ మూవీ టీజర్‌కు మంచి
స్పందన లభించింది.