ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు.1990లో కశ్మీర్ పండిట్‌లపై సాగిన సాముహిక హత్యాకాండ నేపథ్యంలో బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ మూవీని తెరకెక్కించారు. ఎలాంటి ఎక్సపెక్టేషన్స్ లేకుండా మార్చి 11న విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. ప్రధానీ మోదీ సైతం ప్రశంసించిన ఈ సినిమాను చూసేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. కేవలం రూ.10 కోట్ల బడ్జెట్‌తో ఎలాంటి స్టార్ కాస్ట్ లేకుండా వచ్చిన ఈ చిత్రం అందరి అంచనాలను తలికిందులు చేసింది. చిన్న సినిమా అయినప్పటికీ రూ. 250 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. చెప్పాలంటే పాన్ ఇండియా వంటి ‘ఆర్ఆర్ఆర్, రాధ్యే శ్యామ్’ సినిమాలకు ఈ మూవీ పోటీ ఇచ్చింది ఇప్పుడీ సినిమా హిందీతో పటు అన్ని భాషల్లో ప్రేక్షకులకు ముందుకు రానుంది.
ఇప్పటి వరకు థియేటర్ కే పరితమైన ఈ చిత్రం ఇకపై డిజిటల్ ప్రీమియర్ ద్వారా మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయనుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడలో ఈ చిత్రాన్ని మేకర్స్ డబ్ చేశారు. ది కశ్మీర్ ఫైల్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం అన్ని భాషల ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తుండగా.. ఓటీటీ రైట్స్‌ను దక్కించుకున్న ప్రముఖ జీ5 సంస్థ మే 13న డిజిటల్ ప్రీమియర్స్ ను విడుదల చేయనున్నట్టు తాజాగా అధికారిక ప్రటకన వెలువరించింది.