బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న చిత్రం సాక్ష్యం . ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. ఈ
సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కనుంది. ఈ మధ్య రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన
అందుకుంది. ఈ సినిమా హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నారు. కానీ ఎంత మొత్తానికో తెలియాల్సుంది.
ఈ చిత్రం పకృతి నేపధ్యంలో సాగనుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తోంది. జగపతి బాబు, మీనా, శరత్ కుమార్‌లు కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమా ప్రమోషన్ లో సౌందర్య లహరి పాటను విడుదల చేయగా ప్రేక్షకులను బాగా
ఆకట్టుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. హర్షవర్ధన్ రామేశ్వర్
సంగీతం అందించారు.