ప్రస్తుతం ‘భరత్ అనే నేను’ సినిమాలో నటిస్తోన్న మహేష్ బాబు తన తదుపరి చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నాడు. దిల్ రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. అయితే ‘భరత్ అనే నేను’ సినిమా విడుదలైన తరువాత కొంతకాలం పాటు గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నాడట మహేష్. ఈ నిర్ణయంతో దిల్ రాజు ఇరకాటంలో పడ్డాడు. ఎందుకంటే భరత్ అనే నేను సినిమా తర్వాత మహేష్ చేయాల్సింది దిల్ రాజు బ్యానర్ లోనే. కెరీర్ లో ఎన్ని ఫ్లాపులొచ్చినా గ్యాప్ మాత్రం తీసుకోలేదు మహేష్.ఒకే ఒక్కసారి అతడి కెరీర్ లో గ్యాప్ కనిపించింది. సైనికుడు, అతిథి సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అయిన తర్వాత ఖలేజా సినిమా రావడానికి రెండున్నరేళ్లు టైం పట్టింది. ఈసారి కూడా సరిగ్గా అలాంటి గ్యాపే తీసుకోవాలనుకుంటున్నాడు మహేష్. అయితే మహేష్ సన్నిహితులు మాత్రం ఈ మాటలను కొట్టిపారేస్తున్నారు. ఈ సినిమా తరువాత వెంటనే వంశీ పైడిపల్లి సినిమా మొదలవుతుందని అంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!