త్రిషకు బోర్ కొట్టిందట!
ఇండస్ట్రీలోకి కొత్త కొత్త హీరోయిన్స్ ఎందరు వస్తున్నా.. త్రిషకు మాత్రం అవకాశాలు తగ్గలేదు. ఇప్పటికీ
బిజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. రీసెంట్ గా త్రిష అన్ని హారర్ తరహా చిత్రాల్లోనే కనిపించింది.
కళావతి, నాయకి, మొహిని ఇలా వరుస హారర్ చిత్రలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. దీంతో
అమ్మడుకి అన్ని అలాంటి పాత్రలే ఆఫర్స్ వస్తున్నాయట. అయితే వరుసగా ఒకే రకమైన
సినిమాలు చేస్తే ప్రేక్షకులకు కచ్చితంగా బోర్ కొట్టేస్తుందని భావించిన త్రిష ఇకపై హారర్ సినిమాల్లో
నటించనని చెప్పేస్తుంది. కొంతకాలం తరువాత కావాలంటే నటిస్తానని.. ప్రస్తుతం తను మాత్రం
దయ్యం పాత్రల్లో నటించడానికి సిద్ధంగా లేనని చెప్పింది. కమర్షియల్ చిత్రాల్లో నటించాలనుందని
తన కోరికను వెల్లడించింది. అది కూడా మాస్ మసాలా పాత్రలట. మరి అమ్మడుకి అటువంటి
అవకాశాలు ఏ దర్శక నిర్మాతలు ఇస్తారో చూడాలి!