మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా, ఈ చిత్రం క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్ పతాకం పై ఎ. కరుణాకర్‌న్ దర్శకత్వంలో క్రియేటివ్ ప్రోడ్యూసర్ కె.ఎస్. రామారావు నిర్మించిన చిత్రం ‘తేజ్’. ఐ లవ్ యు అనేది ఉపశీర్షిక. ఈ చిత్రం ఈ నెల 6వ తేదిన విడుదులకానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను నిన్న సాయంత్రం భీమవరంలో జరుపుకోంది. ఈ వేడుకలో చిత్ర యూనిట్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. కాగా తాజాగా ఈ సినిమాకు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేస్తుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ జీరోకట్స్‌తో..క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్‌ను జారీ చేసింది.
ఈ సందర్భంగా హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ చక్కటి చిత్రమని, సరదాగా ఉంటుందని, స్వచ్ఛమైన ప్రేమకథతో రూపొందిందని అన్నారు. కుటుంబంలోని భావోద్వేగాలను ఇందులో చూపించారని, ప్రేక్షకులకు సినిమా తప్పకుండా నచ్చుతుందని, ఎంజాయ్ చేస్తారని అన్నారు. నా ముగ్గురు మామయ్యల కష్టం వల్లే ఇవాళ నేను ఈ స్టేజ్‌పై నిలబడి ఉన్నాను. నన్ను ఆదరిస్తున్న మీకందరికీ ధన్యవాదాలు అని అన్నారు. అన్నయ్య పవన్ కల్యాణ్‌గారితో సినిమా చేస్తున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో.. తమ్ముడితో పనిచేస్తున్నప్పుడు కూడా అదే ఫీలింగ్ కలిగింది అని దర్శకుడు కరుణాకర్‌న్ అన్నాడు.