Homeతెలుగు Newsతెలంగాణలో మొదలైన ఎన్నికల యుద్ధం

తెలంగాణలో మొదలైన ఎన్నికల యుద్ధం

తెలంగాణ అసెంబ్లీ రద్దుతో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల యుద్ధం ప్రారంభమైంది. తెలంగాణ అసెంబ్లీ రద్దు చేసి ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించి కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించారు. ఇవాళ మధ్యాహ్నం హుస్నాబాద్‌లో జరిగే బహిరంగ సభతో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. మొత్తం 50 రోజుల్లో 100 సభలు నిర్వహించేలా టీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేసింది.

3 6

మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా ముందస్తు ఎన్నికల ప్రచారానికి దూకుడు పెంచింది. నిన్న ఢిల్లీలోని వార్‌రూమ్ సమావేశాలు నిర్వహించారు. ఇప్పటికే కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను కూడా ప్రకటించింది. ఈరోజు ఉదయం కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నివాసంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. మరోవైపు గాంధీభవన్‌లో పీసీసీ కార్యవర్గం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.

తెలంగాణలో పొత్తులపై టీ-టీడీపీ నేతలు చంద్రబాబుతో మంతనాలు జరుపుతున్నారు. కలిసొచ్చే పార్టీలతో కూటమిగా ఎన్నికల బరిలోకి దిగాలని తెలంగాణ టీడీపీ ఆలోచన. ఈ నెల 15న తెలంగాణలో బీజేపీ ఎన్నికల శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. మహబూబ్‌నగర్ నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతుంది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరుకానున్నారు. అన్ని పార్టీలు ముందస్తు సమరంలో మునిగిపోవడంతో తెలంగాణలో ఎన్నికల దంగల్ పీక్ దశకు చేరింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu