Homeతెలుగు Newsతెలంగాణలో ముందస్తుకు ముహూర్తం ఖరారు?

తెలంగాణలో ముందస్తుకు ముహూర్తం ఖరారు?

తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు జోరందుకున్న తరుణంలో అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 6వ తేదీన అసెంబ్లీని రద్దు చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు పార్టీ వర్గాల సమాచారం. సెప్టెంబర్ 6న ఉదయం 6.45 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశమై అసెంబ్లీ రద్దుకి సిఫార్సు చేయనుందని తెలుస్తోంది. ఆ తర్వాత గవర్నర్ నరసింహన్‌ను కలిసి అసెంబ్లీ రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి లేఖ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.

14 1

కేసీఆర్‌కు ‘6’ అనే అంకె కలిసి వస్తుందని సెంటిమెంట్ అందుకే ఆరోజే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలు వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అంతేగాక, ఆ రోజు ఏకాదశి ఉండగానే అసెంబ్లీని రద్దు చేయాలని భావిస్తున్నట్లు కూడా సమాచారం. అందుకే 6న ఉదయం 6.45నిమిషాలకే అసెంబ్లీ రద్దు చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. కేసీఆర్‌కు ఇలాంటి సెంటిమెంట్స్ ఎక్కువనే విషయం తెలిసిందే. కాగా, ఈ నేపథ్యంలో తెలంగాణ ఎమ్మెల్యేలకు మంత్రులు ఫోన్ కాల్స్ చేసినట్టు సమాచారం. ఆయా నియోజకవర్గాలలో పెండింగ్ లో ఉన్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను రేపు, ఎల్లుండి లోగా పూర్తి చేయాలని ఎమ్మెల్యేలను ఆదేశించారట. ఎమ్మెల్యేలందరూ ఎల్లుండి ఉదయం హైదరాబాదులో అందుబాటులో ఉండాలని మంత్రులు ఆదేశించినట్టు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu