HomeTelugu Newsతిరుపతిలో 'జ్ఞానభేరి' కార్యక్రమం

తిరుపతిలో ‘జ్ఞానభేరి’ కార్యక్రమం

విద్యార్థుల్లో సామర్థ్యం పెంపే లక్ష్యంగా తిరుపతిలో నిర్వహించిన ‘జ్ఞానభేరి’ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వివిధ విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన విద్యార్థులనుద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర భవితవ్యం యువత, విద్యార్థుల చేతిలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 2022 నాటికి రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్‌ వన్‌గా చేస్తానని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో పెట్టేందుకు యువతలో నైపుణ్యాలు పెంచుతామని వివరించారు. ఏదేశానికీ లేని అనుకూలతలు భారత్‌కు, ఆంధ్రప్రదేశ్‌కు ఉన్నాయని అన్నారు.

8 2

ప్రపంచంలో ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు భారతీయుడేనని తెలిపారు. మనం ఉద్యోగాలు చేయడం కాదు.. ఇచ్చే స్థాయికి ఎదగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లో సరికొత్త ఆవిష్కరణల ద్వారా రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రపంచం మారుతున్నట్టే సాంకేతిక రంగంలో కూడా మార్పులు శరవేగంగా వస్తున్నాయని వివరించారు. భవిష్యత్‌లో చేతిలో సెల్‌ఫోన్‌ తోనే అన్ని ప్రభుత్వ సేవలు పొందే రోజులు రానున్నాయని చెప్పారు.

1995లో ఆంధ్రప్రదేశ్‌ పూర్తిగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రమని, తన ముందుచూపుతోనే ఐటీ రంగాన్ని ప్రోత్సహించి హైటెక్‌ సిటీని నిర్మించానని చంద్రబాబు చెప్పారు. ఆనాడు ఐటీ రంగాన్ని ప్రోత్సహించడం వల్లే హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందన్నారు. ఆనాడు తాను తీసుకున్న చర్యల వల్లే 1350 కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చాయన్నారు. ఇవాళ హైదరాబాద్‌ ద్వారా అధిక ఆదాయం వస్తుందంటే ఆనాడు తాను వేసిన పునాదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రాజధాని అమరావతి నిర్మాణాలపై రూపొందించిన లఘచిత్రాలను జ్ఞానభేరి వేదికపై ప్రదర్శించారు. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయ విద్యార్థుల జానపద నృత్యాలు, శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ విద్యార్థుల యోగాసనాలు ఆకట్టుకున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu