టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా త్వరలో పెళ్లిపీటలెక్కబోతుంది. ఈవార్త ప్రస్తుతం సౌత్ సినిమా సర్కిల్స్‌తో పాటు సోషల్ మీడియాలోనూ ఆసక్తికరంగా మారింది. ఈ మిల్కీ బ్యూటీ ఇప్పటికే ఇండస్ర్టీలో అడుగుపెట్టి పుష్కర కాలానికి పైగానే అవుతోంది. ఈమె తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించిన తమన్నా కొద్దిరోజులుగా సరైన సక్సెస్ లేక కష్టాల్లో ఉంది. ఈమె చేసిన అన్ని చిత్రాల్లో బ్యూటీ రోల్స్ తప్ప నటిగా ప్రూవ్ చేసుకునేందుకు ఒక్క అవకాశం కూడా దక్కలేదు.
అమెరికాకు చెందిన ఓ డాక్టర్‌తో త్వరలోనే తమన్నా వివాహం జరగబోతుందని ప్రచారం జరుగుతోంది. ఈ మధ్యకాలంలో సరైన అవకావాలు లేకపోవటంతో పర్సనల్ లైఫ్ మీద దృష్టి పెట్టిందట తమన్నా. ఇప్పటికే తమన్నా కుటుంబ సభ్యులు అబ్బాయిని కూడా ఫైనల్ చేశారని టాక్. అమెరికాకు చెందిన ఓ డాక్టర్‌ను పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలొస్తున్నాయి. 2019 నాటికి తమన్నాకు పెళ్లిచేయాలని అనుకుంటున్నామని ఇంట్లో ఈ విషయం గురించి చర్చలు జరుగుతున్నాయని తమన్నా తల్లి రజనీ భాటియా ఓ ఆంగ్ల మీడియాకు వెల్లడించారు. అయితే తమన్నా ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం తమన్నా క్వీన్ రీమేక్‌లో నటిస్తున్నారు. దీంతోపాటు వెంకటేష్, వరుణ్ తేజ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఎఫ్-2 సినిమాల్లోనూ నటిస్తున్నది.