సామాన్యుల దగ్గరి నుంచి సెలబ్రిటీల వరకు వారి వారి స్థాయిని బట్టి ఫ్రెండ్స్ ఉంటూనే ఉంటారు. మహేష్ బాబు అందుకు మినహాయింపు కాదు. మహేష్ తన ప్రపంచంలో చాలా కొద్దిమంది మాత్రమే ఫ్రెండ్స్ ఉన్నారట. అందులో ది ఫ్రెండ్ అనేవాళ్ళు ఒకే ఒక్కరు ఉన్నారట. అదెవరో కాదు.. మహేష్ భార్య నమ్రత. భార్యగా, స్నేహితురాలిగా బహుముఖ నమ్రతకు మహేష్ బాబు ఫ్రెండ్ డే శుభాకాంక్షలు చెప్తూ.. ట్విట్టర్ లో ఓ ఫోటోను పోస్ట్ చేశాడు. ” నా ఫ్రెండ్, నా ప్రపంచం అయిన నమ్రతకు ఫ్రెండ్ షిప్ డే శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేశాడు.” ఈ ఫొటో ఇప్పడు వైరల్ అవుతుంది.