HomeTelugu Newsతండ్రులకు తారల శుభాకాంక్షలు

తండ్రులకు తారల శుభాకాంక్షలు

ఈరోజు ఫాదర్స్‌ డే సందర్భంగా తమ తండ్రులపై ఉన్న ప్రేమను సినీ నటులు ఇలా గుర్తుచేసుకున్నారు. మనం జరుపుకొనే పండుగలన్నీ ఒక ఎత్తైతే..మాతృ, పితృ దినోత్సవాలు మరో ఎత్తు. ఆ రోజంతా తల్లిదండ్రులతోనే గడపాలనుకుంటాం. వారిని బయటికి తీసుకువెళ్లి, కానుకలు ఇస్తుంటాం. ఇక సినీ ప్రముఖుల గురించైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ తల్లిదండ్రులతో కలిసి దిగిన అపురూపమైన ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

kajal

‘నాకు ఎప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తున్నందుకు, విలువలతో ఎప్పుడూ రాజీ పడకూడదని నేర్పినందుకు ధన్యవాదాలు. ఐ లవ్యూ పాప్స్‌. హ్యాపీ ఫాదర్స్‌ డే’ : కాజల్‌ అగర్వాల్‌

manchu

‘మీరు మా కోసం ఎన్నో పనులు చేస్తున్నందుకు ధన్యవాదాలు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పడూ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను. హ్యాపీ ఫాదర్స్‌ డే నాన్నా’ : మంచు లక్ష్మి

rakul

‘హ్యాపీ ఫాదర్స్‌డే పాప్సీ. నాకు గైడ్‌, మెంటార్‌గా వ్యవహరిస్తున్నందుకు ధన్యవాదాలు. నాకు నిజమైన స్ఫూర్తి. ఏదో ఒక రోజు ఈ భూమిపై మీకు తెలిసిన విషయాల్లో సగమైనా నేను తెలుసుకుంటాను. లవ్యూ’ : రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

varun tej

‘నాన్నే నా బలం. లవ్యూ నాన్న. ప్రపంచంలోని అందరు గొప్ప తండ్రులకు హ్యాపీ ఫాదర్స్‌ డే’ : వరుణ్‌ తేజ్

sushant

‘హ్యాపీ ఫాదర్స్‌ డే నాన్నా. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు’ : సుశాంత్‌

saikumar

‘హ్యాపీ ఫాదర్స్‌ డే నాన్నా.’ : ఆది

rajanikanth

‘నాకు తెలిసిన ఏకైక గొప్ప వ్యక్తి. వన్‌ అండ్‌ ఓన్లీ కింగ్‌. నిజాయితీ, నిబద్ధత, కష్టాన్ని నమ్మే వ్యక్తి. ఈ రాజుకు కూతురిగా పుట్టినందుకు ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను. హ్యాపీ ఫాదర్స్‌ డే అప్పా. ఐ లవ్యూ టూ మచ్’ : సౌందర్య రజనీకాంత్‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu