మిల్కీ బ్యూటీ తమన్నాకు పారిస్ ప్రముఖ డిస్క్ జాకీ స్నేక్ ఛాలెంజ్ విసిరారు. తాను నటించిన ”మెజెంటా
రిడ్డిమ్” పాటకు డ్యాన్స్ చేయాలని తమన్నాతో ఛాలెంజ్ చేశారు. డీజే స్నేక్ ఛాలెంజ్ తమన్నా ఒప్పుకోవడమే
కాకుండా గెలిచింది కూడా. ఎలాంటి కష్టమైన డ్యాన్సులైనా అవలీలగా చేసేస్తారు తమన్నా. అందుకే ఆమెకు
స్పెషల్ సాంగ్స్ల్ లో మంచి అవకాశాలు వస్తున్నాయి. జైలవకుశలో తమన్నా తారక్ తో కలిసి స్వింగ్ జరా
పాటకు వేసిన స్టెప్పులకు ఇప్పటికీ ఎంతో క్రేజ్ ఉంది.
వెస్ట్ర్రన్, ఇండియన్ స్టెప్పులతో తమన్నా చేసిన డ్యాన్స్ కు నెటిజన్లు కూడా ఫిదా అయ్యారు. ఇక డీజే స్నేక్ ఈ
వీడియో చూస్తే ఆశ్చర్యపోవరనడంలో సందేహం లేదు. దాదాపు లక్ష మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు.
డీజే స్నేక్ కోసం మెజెంటా రిడ్డిమ్ ఛాలెంజ్కు ఒప్పుకున్నా, జూయీ వైద్య ఈ పాటకు డ్యాన్స్ కొరియోగ్రాఫ్
చేశారని క్యాప్షన్ ఇచ్చారు.
మెజెంటా రిడ్డిమ్ పాట భారత్ లో చాలా పాపులర్ అయ్యింది. ఈ పాటను కంపోజ్ చేయడానికి ఇటీవల డీజే
స్నేక్ హైదరాబాద్ వచ్చారు. ఈ పాటలో డ్యాన్స్ చేసిన వారిలో ఎక్కువమంది భారతీయులే. తమన్నా, స్నేక్
మంచి స్నేహితులు. బాహుబలి సినిమాను చూసిన స్నేక్ భారతీయ సంస్కృతి, డాన్సులు, తనకెంతో
స్ఫూర్తినిస్తాయని అన్నారు. ప్రస్తుతం తమన్నా కల్యాణ్ రామ్తో నా నువ్వే చిత్రంలో నటిస్తోంది. వెంకటేష్, వరుణ్
తేజ్ మల్టీస్టారర్ చిత్రాల్లోనూ తమన్నా నటిస్తోంది.