పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ తన ట్విటర్ ఖాతా నుంచి తప్పుకున్నారు. ప్రతికూలంగా వ్యాఖ్యలు చేసే వారికి దూరంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ట్విటర్‌లో చాలా ఎక్కువ నెగిటివిటీ ఉందని నాకు అనిపించింది. ఇక్కడున్న వారు దాదాపు అజ్ఞాత వ్యక్తులే. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా చిరాకుతో ఉన్న వారు. సినిమా వారి గురించి, రాజకీయ నాయకుల గురించి ఎప్పుడు ప్రతికూలంగా రాయడానికి ఇష్టపడుతుంటారు’
‘నేను కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న ఈ సమయంలో ఓ నిర్ణయానికి తీసుకొన్నాను. నెగిటివిటీకి దూరంగా ఉండేందుకు నా ట్విటర్‌నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నా. నా మంచి కోరుతూ నన్ను అర్థం చేసుకుని, ప్రతికూల పరిస్థితిలో నాకు తోడుగా నా వెంట ఉన్న ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు’ అని రేణు పోస్ట్‌లో పేర్కొన్నారు. రేణు రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇటీవల నిశ్చితార్థం జరిగింది. పెళ్లి తేదీ, వేదికను ఇంకా నిర్ణయించలేదని ఆమె చెప్పారు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం..నేను సంతోషంగా ఉన్నా..కానీ నిజంగా అంత ఉత్సాహంగా లేను. ప్రేమ కేవలం ఒక్కసారే పుడుతుంది. మళ్లీ మళ్లీ ప్రేమలో పడలేం. గత 7ఏళ్ళుగా ఒంటరిగా ఉన్నా, ఇన్నాళ్లు నేను సంతోషంగానే ఉన్నా. ఆయన(కాబోయే భర్త) చాలా ప్రశాంతంగా ఉంటారు అంటూ తన మనసులో మాట చెప్పారు.’మేమిద్దరం (రేణు, కాబోయే భర్త) సంపాదిస్తున్నాం..సహజీవనం ఎందుకు చేయకూడదు అని కొందరన్నారు.నాకు అలాంటి బంధంపై నమ్మకం లేదు. గతంలో నేను సహజీవనంలోనే ఉన్నా.. అప్పుడు నాకు మరో ఛాయిన్ లేదు. కానీ ఇప్పడు అలా ఉండాలి అనుకోవడం లేదు అన్నారు. అయితే రేణూ తనకు కాబోయే భర్త వివరాలను మాత్రం వెల్లడించలేదు.